రైతులు అధునాతన పద్ధతులలో వ్యవసాయం చేసుకుంటూ ఉండడం, వ్యవసాయ రంగంలో రోజుకొక కొత్త పద్ధతిలో ఆవిష్కరణలు చేస్తుండటం చూస్తున్నాం. కానీ కలుపులుపు తీసేందుకు అధునాతన పరికరాలకు పెట్టుబడి పెట్టలేక కుస్తాపూర్ గ్రామానికి చెందిన రాఘవపేట భూమన్న కూతురు లక్ష్మి.. తనకున్న ఇరవై ఐదు గుంటల భూమిలో కలుపు నివారణ కోసం ముగ్గురు కూలీలతో పాత పద్ధతిలో గుంటుక కొట్టించారు.. కూలీలు కాడెడ్లుగా మారారు.. ఇలా చేయడం వలన కలుపు నివారణతో పాటు, మొక్క బలంగా పెరిగేందుకు గుంటుక ఉపయోగపడుతుందని కూలీల కొరత, ఖర్చు తగ్గిందని రైతు లక్ష్మి తెలిపారు.. కాడేడ్లుగా మారి తోటలో పనిచేస్తుండగా దారివెంట వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు.