Thursday, September 19, 2024
HomeNewsMahabubnagar: బోనమెత్తిన మంత్రి శ్రీనివాస్ యాదవ్

Mahabubnagar: బోనమెత్తిన మంత్రి శ్రీనివాస్ యాదవ్

కురువ సోదరుల ఆధ్వర్యంలో బోనాలు

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రార్థించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 4వ, వార్డు పరిధిలోని ఎదిరలో బోనాల పండుగ పండుగ సందర్భంగా బంగారు మైసమ్మ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎదిరలో బోనాల పండుగకు హాజరైన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్… బోనమెత్తారు. కళాకారులతో కలిసి డోలు వాయించారు. బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. అంతకుముందు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన ఆలయం కాంపౌండ్ వాల్ పనులను మంత్రి ప్రారంభించారు. దేవాలయం షెడ్డు నిర్మాణం కోసం రూ.10 లక్షల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

అనంతరం మీడియాతో మాట్లాడారు… ఎదిరలో బంగారు మైసమ్మ బోనాలను కురువ సోదరుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గతంలో ఎదిర, పాలకొండ అంటే ఎవరికి తెలిసేది కాదని ఇప్పుడు ఈ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. కరువు కాటకాల వల్ల గతంలో ఈ ప్రాంతం నుంచి వలసలు ఉండేవని ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికే వలస వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో జిల్లా అంత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News