Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kottu Sathyanarayana: అర్చకులకు వేతనాల పెంపు

Kottu Sathyanarayana: అర్చకులకు వేతనాల పెంపు

దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ళకు

రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న2,625 మంది అర్చకులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో భాగంగా అర్చకులకు వేతనాలు పెంచామని రాష్ట్ర దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో అర్చకులకు ఇచ్చిన హామీ మేరకు అర్చకుల వేతనాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే 5వేల రూ.లు వేతనాన్ని తీసికుంటున్న అర్చకుల వేతనాన్ని 5,000-10,000 రూ.లకు, 10,000 తీసుకుంటున్న అర్చకుల వేతనాన్ని 15,650 రూ.లకు పెంచినట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యానారాయణ చెప్పారు.
రాష్ట్రంలో గ్రేడ్-3 దేవాలయాల్లో పనిచేస్తున్న ఇఓలకు ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వులను నిలుపదల చేశామని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లోని ఇంజనీరింగ్, విద్యుత్ విభాగాల్లో చాలా వరకూ సాంకేతిక సిబ్బంది పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని ఈ నియామకాలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు చెప్పారు.
దేవాలయాలకు చెందిన ఆస్తుల పరిరక్షణకు సెక్షన్ 83లో సవరణలు తీసుకువచ్చామన్నారు. ఎవరైనా దేవాలయాల ఆస్తులను ఆక్రమించుకుంటే 8 ఏళ్ళ వరకూ శిక్షపడే విధంగా చట్టంలో మార్పులు తెచ్చామన్నారు.

- Advertisement -


రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ గురించి ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను అధికమించేందుకు 2లక్షల 60 వేల మంది యువతకు గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఉపాధి కల్పించామన్నారు. వీరి నియామకంలో సామాజిక న్యాయాన్నిపాటించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం నియమించామని స్పష్టం చేశారు. వాలంటీర్లలో లక్షా 80 మంది వరకూ మహిళలే ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ల వంతున కోటి 60 లక్షల కుటుంబాలకు వీరు సేవలందిస్తున్నారని సత్యనారాయణ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News