Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: చాగలమర్రి అభివృద్ధికి కోటి మంజూరు

Gangula: చాగలమర్రి అభివృద్ధికి కోటి మంజూరు

అన్ని సమస్యలు తీర్చేయాలని అధికారులకు ఆదేశం

గత 15 రోజులుగా చాగలమర్రిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు తెలిపిన సమస్యలపై సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ ప్రజలు తెలిపిన పలు సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని కొత్తగా నిర్మాణం చెపట్టనున్న రోడ్లు, డ్రెయిన్లు, త్రాగునీటి సమస్యను త్వరగా పూర్తి చేయాలని ఇంటి స్థలం మంజూరు అయిన వాళ్లు త్వరగా ఇల్లు కట్టుకునెలా బిల్లులు సకాలంలో వచ్చేలా చూడాలని ఏదైన సమస్య తలెత్తితే తనకు తెలియజేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే గంగుల నాని.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస రావు , వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ , మండల అధ్యక్షుడు వీరభద్రుడు, ఉప సర్పంచ్ షేక్ సోహెల్ , ఉపమండల అధ్యక్షుడు ముల్లా రఫీ, మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి గారి ఇబ్రహీం , మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జాబీర్ , ఎంపీటీసీ సభ్యులు ఫయాజ్, లక్ష్మీరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు దస్తగిరి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి , ఎంపీడీవో మహమ్మద్ దౌల , ఏఈలు కొండారెడ్డి, ముల్లా షాజహాన్ , షఫీ ఉల్లా ,రామక్రిష్ణ మెడికల్ స్టోర్ అధినేత వైఎస్సార్సిపి యువ నాయకుడు తొమండ్రు నాగేంద్ర , ఐడియా బాబు , గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు అలాంస గారి అబ్దుల్ , వెంకటరమణ, ఖాజామోహిద్దీన్, గేట్ల మహబూబ్ సాబ్ , ముల్లా ఖాదర్ బాష , చక్రం బీడీ ముల్లా షబ్బీర్, పెయింటర్ షరీఫ్, సీడ్ షేక్షా, పెయింటర్ గౌస్ పీర్ , బచ్చు సుబ్రహ్మణ్యం , పెద్ద రాముడు, స్వామి రెడ్డి, మాబు సున్నా, అబ్దుల్లా, బబ్లు , వలిసా గారి రఫీ, మండల ప్రచార కార్యదర్శి సెంటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.


చాగలమర్రి పట్టణ అభివృద్ధికి కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఆర్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజింద్రారెడ్డి ప్రకటించారు. చాగలమర్రిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా గ్రామ సచివాలయంలో సర్పంచ్ తులసమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి ఈ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు . ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల ప్రకారం 5 సచివాలయం కలిపి కోటి రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని ఆయన తెలిపారు.

ఇందులో పట్టణంలో విద్యుత్ లైన్ల ఆధునికరణ చేసి కొత్తగా కరెంటు స్తంభాల ఏర్పాటుకు 30 లక్షల రూపాయలను కేటాయిస్తున్నామన్నారు . అలాగే రోడ్లు లేని వీధుల్లో సిసి రోడ్లు వేయించి మురికి కాలువలు నిర్మిస్తారని ఆయన తెలిపారు . చాగలమర్రి అభివృద్ధికి ఇకముందు కూడా పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు . అర్హులైన పేదలకు రెండవ విడత కింద ఇంటి స్థలాల పంపిణీకి భూముల కొనుగోలుకు నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు . ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు . ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేస్తే ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. 0 వడ్డీ రాని గ్రూపులందరికీ న్యాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News