Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Rudravaram: సర్పంచుల నిధులు దోచుకున్న ఘనత జగన్ దే-అఖిలప్రియ

Rudravaram: సర్పంచుల నిధులు దోచుకున్న ఘనత జగన్ దే-అఖిలప్రియ

రాబోయేది మా సర్కారే అంటున్న భూమా

రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సర్పంచ్ల నిధులు దోచుకున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టిడిపి అబ్జర్వర్ వెంకట శివుడు యాదవ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండలంలోని టీ లింగందిన్నె గ్రామంలో యువగలం పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని గడపగడపకు వెళ్లి గ్రామ సమస్యలపై గ్రామస్థులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తమ నాయకుడు లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రతి నియోజకవర్గంలో ప్రజలు యువత బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. పాదయాత్రలో లోకేష్ అష్ట కష్టాలు పడుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆలోచనలో అసంపూర్తిగా ఉన్న యువతకు ప్రజలకు పూర్తి భరోసా ఇస్తూ పాదయాత్రను ముందుకు వెళ్తున్నారని అన్నారు. గ్రామానికి తమ తల్లిదండ్రులు కానీ తాను కానీ ఎప్పుడు వచ్చినా ప్రజల నుండి మంచి స్పందన రావడం జరుగుతోందన్నారు. ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ఏ సమస్య వచ్చినా ఈ గ్రామానికి వెంటనే వచ్చి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. సర్పంచులకు నిధులు లేకుండా చేసి గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారారని ఒక లైటుగాని రోడ్డు సర్పంచులు వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే గ్రామాలు అభివృద్ధి చేసుకునేందుకు సర్పంచులకు నిధులు పుష్కలంగా అందజేస్తామని సర్పంచులకు గౌరవం దక్కేలా చేసి చూపిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని టిడిపి అధికారంలోకి వస్తే నిత్యవసర సరుకుల ధరలు తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు ప్రజలకు మాటివ్వడం జరిగిందన్నారు. మహిళల ఇబ్బందులను కష్టాలను గమనించి మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు.

- Advertisement -

అమ్మఒడి పథకంలో వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒక్కరికి ఇస్తున్నారని టిడిపి అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ అమ్మఒడి ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు చెప్పామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడేది చంద్రబాబు నాయుడు లోకేష్ బాబేనని ఆమె అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా పరిపాలన సాగించామని ప్రస్తుత ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని టిడిపి నాయకులను కార్యకర్తలను ఎన్ని ఇబ్బందుల గురిచేసినా తాము అండగా ఉంటామని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ముందుకు వెళ్తారని తమ మీద తమ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ మీద నమ్మకం ఉంచి ప్రజలు రానున్న రోజుల్లో తమకు ఓటు వేయాలని ప్రజలందరికీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి, చిన్నికృష్ణ, ఎర్రం ప్రతాప్ రెడ్డి, ఎల్వి రంగనాయకులు, బండారు బాలరాజు, లక్ష్మీకాంత్ యాదవ్, శ్రీనివాసులు, పత్తి బాచెపల్లె నారాయణ, బలరాం రెడ్డి తోపాటు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News