Saturday, October 5, 2024
HomeతెలంగాణRasamai Balakishan: పల్లె పల్లెనా బిఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

Rasamai Balakishan: పల్లె పల్లెనా బిఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

మానకొండూర్ నియోజకవర్గంలో ప్రతి ఊళ్లో నిరసనలు

బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ సారథ్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజాప్రతి నిధులు, బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన శవయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి పాల్గొని రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ… వ్యవ‌సాయా నికి 24 గంటల ఉచిత కరెంట్‌ సరఫరాపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన‌ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తెలంగాణ‌ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డికి ఎంత‌ కండ్ల మంట ఉందో అర్థమవుతుంద న్నారు. సీఎం కేసీఆర్‌ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట గొట్టేందుకు చూస్తుంద‌ని, కాంగ్రెస్, టీడీపీ పాల‌న‌లో క‌రెంటు లేక రైతులు అరిగోసప‌డ్డార‌ని, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతుల‌ను మళ్లీ చీక‌ట్లోకి నెట్టేసే కాంగ్రెస్ పార్టీ ప్రయ‌త్నాలను ప్రజ‌లు, రైతులు తిప్పికొడ‌తార‌ని ఎమ్మెల్యే రసమయి హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-అలుగునూర్ లో…
అలుగునూర్ (8వ డివిజన్)లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ
వెంటనే వాక్యాలను ఉపసంహరించుకోవాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని కోరుతూ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జాప శ్రీనివాస్ రెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -


-మన్నెంపల్లి గ్రామంలో….
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అద్యక్షులు, ఉప-సర్పంచ్ పొన్నం అనీల్ గౌడ్ అధ్వర్యంలో స్థానిక బస్స్టాండ్ వద్ద రైతులుతో కలిసి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నార్ల అశోక్, రైతుసమన్వయ సమితి అధ్యక్షులు నాంపల్లి శంకరయ్య, గుర్రం జగదీష్, రావుల మల్లేశం, గుంటి కిష్టయ్య, బుడిధ కిషోర్, నాంపల్లి చంద్రమౌళి, నాంపల్లి తిరుపతి, కమెరా సంపత్, ఏం.డి మహమ్మద్, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News