నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామం ఈమధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్న పేరుగా మారింది. ఇక్కడి యువత షార్ట్ ఫిలిమ్స్ పై ఫోకస్ పెడుతుండటమే దీనికి కారణం. స్థానికంగానే షూటింగ్ చేసేస్తూ, సోషల్ మీడియాలో తమ క్రియేటివిటీతో దూసుకుపోతుండటం వీరి స్పెషాలిటీ.
ఈ మధ్య కాలంలోనే ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ లో దూసుకుపోతున్న యువకుడు ఒబులయ్య పేరు సాధించిన ఘనత ఈయన. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామానికి చెందిన యువకుడు ఓబులయ్య తనకు ఉండే చిత్రసీమ కల నెరవేరాలని ఇలాంటి లఘుచిత్రాలను తీస్తున్న అన్నాడు. ఇప్పటి వరకు 5 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. “బాధ్యత” అనే టైటిల్ తో మరోసారి ముందుకు వస్తున్నాడు.
వరుసగా లఘు చిత్రాలతో దూసుకుపోతున్న చాగలమర్రి గ్రామంలో నల్లమల జగదీశ్ అనే పేరు చాలా పాపులర్ అవుతోంది. చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి చెందిన యువకుడు నల్లమల జగదీశ్ ఇప్పటి వరకు 10 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఈయన తీస్తున్న సరి కొత్త చిత్రం” రక్షక్ ” అనే టైటిల్ తో ముందుకు వస్తున్నాడు.
చాగలమర్రికే చెందిన మరో లఘుచిత్ర డైరెక్టర్ నాసిర్ పఠాన్ షార్ట్ ఫిల్మ్ లకు రచయితగా పనిచేస్తున్నాడు. నాసిర్ పఠాన్ దర్శకత్వంలో ఇప్పటి వరకు 5 చిత్రాలకు రిలీజ్ అయ్యాయికూడా. “వసాద్” అనే టైటిల్ తో మరోమారు ముందుకు వస్తున్నాడు పఠాన్. జూన్ లో వసాద్ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందనే లభించింది. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో విడుదల చేయాలని డైరెక్టర్ నాసిర్ పఠాన్ చెప్పారు.
ఈ షార్ట్ ఫిల్మ్ లో హీరో మాబాషా , విలన్ ఖలందర్, యాక్టర్లు దోడియం చిన్న వాసు, వల్లంకొండు సాయి, హుసేన్ , అల్లంసా గారి దస్తగిరి, సాగర్ , బాలాజీ, అబ్దుల్, శ్రీకాంత్ , షాహిద్, గౌస్ సుభాష్ తదితరులు చాలా అద్భుతంగా నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ని ఎడిటర్ వర్ధన్ చాలా చక్కగా తీర్చిదిద్దారు.
చాగలమర్రి లో లఘు చిత్రం ” సెలా ” షూటింగ్ సందడి
చాగలమర్రి గ్రామంలో గొడిగనురు గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడు లఘు చిత్రం ద్వారా తన డైరెక్షన్ రూపంలో తెరకెక్కుతున్న చిత్రం ” సెలా “. ఈ చిత్రం విభిన్న కథగా ఉంటుందని పేర్కొన్నారు. కిషోర్ ఇప్పటికే 3 లఘు చిత్రాలకు కెమెరామెన్ గా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీసుకుంటూ పరిచయం అయ్యారు.