MM Keeravani : సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి భానుమతి కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను మూడు రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయాన్ని రాజమౌళి నివాసానికి తరలిస్తున్నారు.
తల్లి మృతితో కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు కీరవాణి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.
దర్శకుడు రాజమౌళి, ఎమ్ ఎమ్ కీరవాణి అన్నదమ్ములు అవుతారు అన్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. కీరవాణి తండ్రి శివ శక్తి దత్త అన్నదమ్ములు. అందరూ ఉమ్మడి కుటుంబంగా పెరగడంతో పెద్దమ్మ అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. ఇక రాజమౌళి ప్రతి సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తారు. ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ వరకు కీరవాణినే సంగీత స్వరాలను సమకూర్చారు. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.