రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం రోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి మహా ధర్నా కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించగా వేములవాడ నియోజకవర్గంలోని ప్రముఖ నేతలే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే వేములవాడ నియోజకవర్గంలో ఉంటూ బిఆర్ఎస్ సీనియర్ నేత అని వార్తల్లో ప్రచారం అవుతున్న ప్రముఖ నేత గోలి మోహన్ మహా ధర్నాలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం పనిచేస్తామని మీడియా ముఖంగా తెలిపిన సీనియర్ నేత చెల్మెడ లక్ష్మీనరసింహారావు కూడా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన ధర్నాలో కనిపించకపోవడం శోచనీయం.
అసలు ఈ ఇద్దరు నేతలు ధర్నాలో పాల్గొనకపోవడానికి కారణం ఏంటో? ఏది ఏమైనా ఎన్ని వర్గ విభేదాలు ఉన్న అంతిమంగా బిఆర్ఎస్ పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందే. మరో బిఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి మహాధర్నాలో ఉత్సాహంగా పాల్గొనగా ఆయనకు రైతుల గూర్చి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు అతని అభిమానులు నిరాశకు లోనయ్యారు. అయితే ఈ ముగ్గురు కీలక నేతలు బిఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.