Friday, September 20, 2024
HomeతెలంగాణManakonduru: దిష్టిబొమ్మను ఉరి తీసిన రసమయి

Manakonduru: దిష్టిబొమ్మను ఉరి తీసిన రసమయి

రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి వేసిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను ఉరితీసి దహనం చేశారు. దీనిలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి, బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు, సుడా ఛైర్మెన్ జీవి. రామకృష్ణా రావు పాల్గొని రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఉరి తీసి నిరసన తెలి పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News