Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Gulf deaths: గల్ఫ్‌ వలసలు ఎలా ఆపగలం?

Gulf deaths: గల్ఫ్‌ వలసలు ఎలా ఆపగలం?

తెలంగాణ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారికి లెక్కేలేదు

బతుకు భారమై జీవనోపాధి కొరకు గల్ఫ్‌ దేశాలకు కార్మికులు వలస పోతున్నారు. అభివృధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే గల్ఫ్‌ దేశాలకు కార్మికుల వలస ఎక్కువగా వుందని వలస నిపుణుడు ‘ఇంటర్‌ నేషనల్‌ ఇన్సూటూట్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ మైగ్రేషన్‌ అర్బన్‌ స్టడీస్‌ విభాగ అధిపతి ప్రొఫెసర్‌ ఆర్‌.బి భగత్‌’ తమ అధ్యయనంలో తెలిపారు.
గల్ఫ్‌ దేశాల వలస కార్మికుల్లో ఎక్కువ మంది దక్షిణ భారత దేశంలోని 5 రాష్ట్రాలైన కర్ణాటక కేరళ ‘తమిళ నాడు’ ఎపి తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చినట్లు ప్రొఫెసర్‌ ఆర్‌’ బి’ భగత్‌ పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణ గల్ఫ్‌ వలసలు
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌ కరీం నగర్‌ జగిత్యాల రాజన్న సిరిసిల్ల ‘కామారెడ్డి’ నిర్మల్‌ ఆది లాబాద్‌. హైదరాబాద్‌ జిల్లాలలో ఉన్న యువకులు ఉపాధి కొరకు గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్ళారు. నాటి సమైక్య రాష్ట్రంలో (ఏపీ) ఏర్పడిన తీవ్ర కరువు కాటకాలు, వర్షా భావ పరిస్థితులు వాటికి తోడు నాటి ప్రభుత్వాలు అవలం భించిన ప్రాంతీయ వివక్ష సగటు తెలంగాణ యువకుడిని గల్ఫ్‌ వైపు చూసేలా చేశాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లోప్రతి ఊరిలో గల్ఫ్‌ కార్మి కులున్నారు. భూమి లేని సామాజికంగా బలహీన వర్గాల కుటుంబాలనుండి గల్ఫ్‌ వలసలు ఎక్కువ వున్నాయి. వ్యవ సాయానికి భూమిలేక కూలీలు లభించక ‘పండిన పంటకు గిట్టుబాటు ధర లేక’ సాగునీరు లేక ఎలాంటి పని లేని దొరకని స్థితిలో వున్న భూమిని అమ్ముకొని ఏజెంట్ల మా యా మాటల్లో పడి ఉచితంగా వచ్చే వీజా కొరకు లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలై ఏజెంట్ల మోసాలకు బలై ఆర్థికంగా దివాలా తీసిన కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. (కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు ఉన్నాయి). తల్లి ‘పెళ్ళాం’ పిల్లలను వదిలి గల్ఫ్‌ దేశాలకు వలస వచ్చిన యువత దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారని అనేక సర్వేల్లో తేలింది.
కార్మిక చట్టాలు గల్ఫ్‌ కార్మికులు
గల్ఫ్‌ దేశాల కార్మిక చట్టాల మీద అవగాహన లేక పోవడం వల్ల కార్మికుల చేత కంపెనీలు తక్కువ వేతనాలకు ఎక్కువ పని గంటలు పనిచేయించుకొని శ్రమదోపీడీకి పాల్పడుతున్నాయి. పోలీసుల రైడింగుల్లో పట్టుబడి చేయని నేరానికిజైళ్ళలో మగ్గుతున్న అనేకమంది కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వారికి ఎలాంటి న్యాయ సహాయం అందడం లేదు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే కోటి ఆశలతో ఆకాంక్షలతో ఎదురు చూసిన తెలంగాణ యువతకు నిరాశే మిగిలింది. బతుకు తెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్ళే కార్మికుల సంఖ్య తగ్గలేదు. వలసలు ఆగలేదు. గల్ఫ్‌ బాధిత కుటుంబాల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. గల్ఫ్‌ దేశాల్లో పనిచేయటానికి భారతదేశం నుండి వెళ్లిన కార్మికుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన. కరీంనగర్‌ నిజామాబాద్‌ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల ‘జగిత్యాల’ ఆదిలాబాద్‌ నిర్మల్‌’ జిల్లాలో దాదాపు ప్రతి ఇంటికి ఒకరు గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కుటుంబాలు వున్నా యి. హైదరాబాద్‌ జిల్లా నుండి కూడా తప్పనిసరి పరిస్థి తుల్లో గల్ఫ్‌కు వలస వెళ్లే యువత ఎక్కువ మంది వున్నారు.
విదేశీ మంత్రిత్వశాఖ గణాంకాలు
బతుకు పోరాటంలో గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు విదేశీ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. 2021 జనవరి నుండి ఆక్టోబర్‌ వరకు 2022 జనవరి నుండి అక్టోబర్‌ వరకు గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు తెలియచేసింది. 2022 జనవరి నుండి అక్టోబర్‌ నాటికి 9576 మంది కార్మికులు 9 గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారు. వీరిసంఖ్య గత సంవత్సరం 2021 జనవరి నుంచి అక్టోబర్‌ నాటికి 4375 మంది మాత్రమే వలస వెళ్లగా 2022 నాటికి వీరి సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకులు బాగుపడతాయను కొన్న గల్ఫ్‌ వలస కార్మికులకు నిరాశే మిగిలింది. గల్ఫ్‌ దేశాలకు జరిగే వలసలు కొనసాగుతూనే వున్నాయి. కొత్తగా మలేషియాకు కూడా వలసలు పెరిగాయి 104 మంది కొత్తగా ఉపాధికి వెళ్లినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్ల డించింది. ఇంతే గాకుండా ‘టూరిస్ట్‌ వీజా’ మీద ఉపాధి కొరకు అధిక సంఖ్యలో వెళ్లినట్లు స్వచ్చంధ సంస్థల సర్వే ల్లో వెల్లడైంది. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ గల్ఫ్‌ బాధి తులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు.
ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పన ఆశించిన మేరకు లేక పోవడం వల్లగల్ఫ్‌ వలసలు ఆగలేదు. ఉపాధి అవకాశాలు పెరిగాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో పేదరికం నిరుద్యోగం బాలకార్మికులు ఆర్థిక అసమానతలు ప్రకృతి వైపరీత్యాలు కరువులు ‘అతివృష్టి అనావృష్టి’ పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం గ్రామీణ చేతివృత్తుల క్షీణత ఆర్థిక అవసరాల పెరగడం వల్ల గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్ళక తప్పని పరిస్థితులు నెల కొన్నాయి.
కరోనా గల్ఫ్‌ కార్మికులు
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక. వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ కుదేలైంది. కరోనా ప్రభావం వల్ల గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర కార్మికులు బిక్కు బిక్కు బిక్కుమంటూ జీవితాలను వెలిబుచ్చుతున్నారు. పలు కంపెనీలు ‘లాక్‌ డౌన్‌’ ప్రకటించడం వల్ల చాలా మంది కార్మికులు ఉపాధి కొల్పయ్యారు. రావాణా సౌకర్యాలు మందగించడం వల్ల సొంత ప్రాంతాలకు రాలేక కార్మికులు దుర్భర పరిస్థితుల్లో జీవితాలు వెల్లదిస్తున్నారు. ఇటీవల విమాన రవాణా సౌకర్యాలు మెరుగుపడడం వల్ల గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్ళే కార్మికులకుల సంఖ్య పెరిగింది. వలస కార్మికుల సంక్షేమం పట్ల ఆయాదేశాల ప్రభుత్వాలు శ్రద్ధ వహించక పోవడం శోచనీయం బెహ్రాన్‌ ఓమెన్‌ దేశా ల్లో పనిచేస్తున్న వలస కార్మికులను పట్టించుకునే నాథుడే లేడు. ఆదేశాల్లో అనేక కేసుల్లో మన దేశ కార్మికులు ఇరుక్కొని జైలు జీవితం గడుపుతున్న వారిలో తెలంగాణ రాష్ట్రా నికి చెందిన కార్మికులే ఎక్కువ వున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్న కార్మికులు గల్ఫ్‌ జేఏసీగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమానికి స్వచ్ఛం దంగా విరాళాలు అందించి ఉద్యమానికి బాసటగా నిలిచారు. స్వరాష్ట్రంలో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనుకొన్న వలస కార్మికుల ఆశలు అడియాశలైనాయి. గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్యను విదేశాంగ మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసింది.
2021 జనవరి నుండి అక్టోబర్‌ వరకు, 2022 జనవరి నుండి అక్టోబర్‌ వరకు వివిధ జిల్లాల నుండి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సంఖ్య ఈ విధంగా వుంది.
కరీంనగర్‌ 2021 (640) 2022 (1062) నిజామా బాద్‌ 2021 (1322) 2022. (2476).
అదిలాబాద్‌ 2021 (360) 2022 (670) నిర్మల్‌ 2021(252) 2022 (626) జగిత్యాల 2021 (303) 2022 (710) హైదరాబాద్‌ 2021 (752) 2022 (2235) గల్ఫ్‌ దేశాలకు వలసల వెళ్లే కార్మికుల్లో నిజామా బాద్‌ హైదరాబాద్‌ ‘కరీంనగర్‌’ ప్రథమ ‘ద్వితీయ’ తృతీయ స్థానములో వున్నాయి.
గల్ఫ్‌ దేశాలైన బెహారాన్‌ ఇరాక్‌… జోర్డాన్‌ కువైట్‌ ఓమెన్‌ మలేషియా (యుఏఈ) సౌదీ ఖతార్‌ మొదలగు 9 దేశాలకు వలస వెళ్లిన కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
ప్రైవేట్‌ ఎజెంట్‌ల ద్వారా వెళుతున్న వారి సంఖ్య కచ్చితంగా తెలియడం లేదు. ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ రిక్వెస్ట్‌ ద్వారా 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ నాట్‌ రిక్వెస్ట్‌ కింద వెళ్ళే వారి సంఖ్య వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. 10వ తరగతి కంటే ఎక్కువ విధ్యారహితాలు వుండి గతములో 3 యేళ్ల పాటు పనిచేసిన వారి హిస్టరీ ఐటీ రిటరన్స్‌ దాఖలు చేసిన వారికి ఈసీఆర్‌ కింద విజాలు జారీ చేస్తారు. టూరిస్ట్‌ విజా కింద వెళ్ళే కార్మికుల వివరాలు ప్రభుత్వం వద్ద లేవు.
తెలంగాణ ఆవిర్భావం నుండి ఎన్‌ఆర్‌ఐ పాలసీని గల్ఫ్‌ దేశాల కార్మికులకు వర్తింప చేయమని గల్ఫ్‌ కార్మికు లను కోరుతున్నారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి ఆదుకోవాలి. అన్న వారి డిమాండ్‌ నేటివరకు నెరవేరలేదు. ఇటీవల ప్రజా సంగ్రామం యాత్రలో భాగంగా రాష్ట్ర బిజెపి అధ్య క్షులు కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ కుమార్‌ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో గల్ఫ్‌ కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకవెల్లి సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని గల్ఫ్‌ జేఏసీ ప్రతినిధుల బృందానికి హామీ ఇవ్వడం గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు గొప్ప ఊరట ఇచ్చే అంశంగా పేర్కోవచ్చు. 2016 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలకు వలసలు అరికట్టడానికి సాధా రణ పరిపాలన శాఖ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రైవేట్‌ ఎజెంట్ల బారిన పడకుండా వారి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వమే మాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏజెన్సీ)ను నెలకొల్పింది. ఎన్‌ఆర్‌ఐ సెల్‌ గల్ఫ్‌ వలసలను ఆపలేక పోయింది. విదేశీ వ్యవహారాల మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో ఎంఏడిఎడీ వెబ్‌ సైట్‌ ద్వారా గల్ఫ్‌ బాధితులకు సహాయం పొందటానికి కార్మికులు దరకాస్తు చేసుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అలంకార ప్రారంభమైందన్న విమర్శలున్నాయి.
సామాజిక ఆర్థిక వేత్తల ఆందోళన
రాష్ట్ర రాజధానిలో (హైదరాబాద్‌) కొన్ని ముఖ్య నగ రాలలో ఉత్తరప్రదేశ్‌ మధ్య ప్రదేశ్‌ ఒరిస్సా ఛత్తీస్‌గఢ్‌ జార్ఖండ్‌ బీహార్‌ రాష్ట్రాల నుండి లక్షలాది కార్మికులు వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. పొందుతున్న ఆదాయాలను తమ రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇక్కడి కార్మికులు ఉపాధి కొరకు గల్ఫ్‌ దేశాలకు వెళ్ళే విచిత్రమైన పరిస్థితులు పట్ల సామాజిక ఆర్థిక పాలనా వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములో ఆయా ప్రాంతాలలో లభించే వనరులు అవసరాలు దృష్టిలో పెట్టుకొని యువత కు ఉపాధి అవకాశాలు కల్పించాలి. స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ నెలకొల్పి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి.
ప్రభుత్వం గల్ఫ్‌ సంక్షేమ నిధి
ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ నిధితో ఎన్‌ఐ సెల్‌ ఏర్పాటు చేసి గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తు చనిపోయిన కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేసియా చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలి.
గల్ఫ్‌ వలసలు నివారణా చర్యలు

గల్ఫ్‌ బాధితుల కుటుంబాలకు చెందిన బాల బాలికల కోసం రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో కొన్ని సీట్లు కేటా యిస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలి గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయ సహాయం అందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమ అభివృధి వ్యూహాన్ని అమలు చేసి కార్మికుల ఆర్థిక సామాజిక ఆరోగ్య స్థితి గతులను మెరుగు పరిచే చర్యలు చేపట్టాలి. కార్మికు లకు జీవిత భీమా ఆరోగ్య భీమా సౌకర్యo కల్పించాలి.
గల్ఫ్‌ దేశాల వలసలకు దారి తీసిన పరిస్థితులు స్థానిక. వనరుల లభ్యత ఉపాధి అవకాశాలు? ఏమి ఉత్పత్తి చెయ్యాలి? ఎలా ఉత్పత్తి చెయ్యాలి? ఎవరికోసం ఉత్పత్తి చెయ్యాలి? అనే అంశాల మీద ప్రభుత్వం నిపుణుల కమిటీ చేత అధ్యయనం చేయించాలి. ప్రభుత్వం సూక్ష్మ స్థాయి స్థూల స్థాయి ప్రణాళికలు రూపొందించి శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్దతులు ఉపయో గించే పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.యువతకు నిరుద్యోగ బృతి ఇవ్వాలి.
ప్రభుత్వం నిరుద్యోగ యువతకు పావల వడ్డీకి రుణా లు ఇచ్చి చిన్న వ్యాపారం చిన్న పరిశ్రమలు దుకాణాలు పెట్టుకోవటానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు గ్రామీణ చేతి వృత్తులు ఖాదీ గ్రామీణ పరిశ్రమలు కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు సంస్థాగత రుణాలు ఇవ్వాలి. చేతి వృత్తుల ఆధునికీకరణ నూతన సాంకేతిక విధా నాల పట్ల యువతకు శిక్షణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలి.
జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసులు కేవలం నిరుద్యో గుల సంఖ్య నమోదు కేంద్రాలుగా కాకుండా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలపై కౌన్సిలింగ్‌ ఇచ్చే కేంద్రా లుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ, పారి శ్రామిక పాలటెక్నిక్స్‌ ఐటీఐ ఉపాధి ధోహక కోర్సులను విద్యా సంస్థల్లో ప్రవేశ పెట్టాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశెట్టిన దళిత బంధు పథకంలో గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు 3 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం ప్రవేశ పెట్టి ఆర్థికంగా ఆదుకోవాలి. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మహిళా స్వశక్తికరణ మహిళలకు ఎంబ్రాయిడరీ రెడీ మేడ్‌ డ్రెస్సింగ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులు కంప్యూటర్‌ కోర్సలు ప్రవేశ పెట్టి సాం కేతిక రంగంలో రాణించడానికి అవకాశాలు కల్పించాలి. యువత సాధికారిత మహిళా సాధికారత హరిజన గిరిజన బిసి వర్గాల సంక్షేమం పేద వర్గాల ఆర్థిక సాధికా రిత సాధనకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి.
రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్‌ వల సల నివారణ కొరకు చేపట్టే కార్యాచరణ ప్రకటించాలి.
ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికులు ఉన్న నియోజక వర్గాలలో సర్వే చేసి వారి సమస్యలు పరిష్కారం దిశగా కార్యాచరణ చేపట్టాలి. యువతకు స్వయం ఉపాధి కల్పన ఔత్సాహిక యువ తను వ్యాపార ‘వాణిజ్య’ పరిశ్రమల స్థాపన వైపు ఆసక్తి కలి గించే పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించి యువత లో ఉద్యమిత్వ నైపుణ్యాన్ని పెంపొందించి మెరుగైన ఉపాధి అవకాశాలను కలిపించాలి.
యువత ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగి తోటి యువతకు ఉపాధి కల్పించే శక్తి సామర్థ్యాలు సంతరించుకోవాలి. ఆత్మనిర్భ్రతతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి సారథులుగా నిలువాలి. ప్రభుత్వం శ్రమయేవ జయతే అన్నది నినాదం కాకుండా కార్మిక లోక సమగ్ర సంక్షేమా నికి పాటు పడే విధానాలకుపెద్దపీట వెయ్యాలి. గల్ఫ్‌ దేశాలకు వలసలు అరికట్టి గల్ఫ్‌ బాధిత కుటుంబాలలో వెలు గులు తెచ్చే విధానాలకు ప్రభుత్వం పూనుకోవాలి.

  • నేదునూరి కనకయ్య
    తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు
    9440245771
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News