Free Bus Ticket : ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాల్సిందే. కొందరు జిమ్‌లకు వెళితే మరికొందరు ఉదయపు నడకకు వెలుతుంటారు. అయితే చాలా మంది మాత్రం వ్యాయామం చేసేందుకు బద్దకిస్తుంటే మరికొందరు రోజువారి పనిఒత్తిడిలో పని వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో తమ దేశ పౌరులు ఆరోగ్యంగా ఉండాలని బావించిన ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. గుంజీలు తీస్తే బస్సు టికెట్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఇది మనదగ్గర కాదులెండి యూరప్‌లోని రొమేనియా నగరంలో మాత్రమే.
స్పోర్ట్స్ ఫెస్టివల్ అనే ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ఉచిత టికెట్‌ను హెల్త్ టికెట్‌గా పిలుస్తారు అక్కడి ప్రజలు. అయితే.. ఇక్కడో చిన్న కండిషన్ ఉందండోయ్.. కేవలం 2 నిమిషాల్లో 20 గుంజీలు తీసిన వారికే ఉచితంగా బస్సు టికెట్ దొరుకుతుంది.
alinabzholkina అనే యూజర్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఓ అమ్మాయి టికెట్ మిషెన్ ముందు నిలబడి 20 గుంజీలు తీసింది. ఆమె గుంజీలు తీయడం పూర్తికాగానే మిషన్ నుంచి టికెట్ బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.