Sunday, November 10, 2024
HomeతెలంగాణTandur: కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Tandur: కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

కార్మికుల డిమాండ్లను నెరవేర్చడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం?

పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. తాండూరు మండల పరిషత్ ఆవరణంలో గత తొమ్మిది రోజులుగా 20 డిమాండ్లతో కూడిన పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మెలో తాండూర్ నియోజవర్గ బీసీ సంఘం నాయకులు పాల్గొని కార్మికులకు సంపూర్ణంగా మద్దతు పలికారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కార్మికులు బతుకులు బాగుపడతాయని ఎంతో ఆశపడ్డారని అందుకు విరుద్ధంగా ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా ఉంటుందని గత తొమ్మిది రోజులుగా పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీసీ సంఘం పూర్తిగా అండగా ఉంటుందని వారి న్యాయమైన 20 డిమాండ్లు నెరవేరేవరకు తోడుంటామని కార్మికులకు బీసీ సంఘం నాయకులు భరోసా కల్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బుగ్గప్ప, రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ సుకుర్, బీసీ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యువజన సంఘం నాయకులు బసవరాజ్, నరేష్, అశోక్, కృష్ణ, రామకృష్ణ, సురేందర్, కార్మికులు జైరామ్, నర్సింలు, సాబిర్, సాయప్ప, రాజ్ కుమార్, జీలని, శామప్ప, వెంకటేష్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News