Friday, November 22, 2024
HomeతెలంగాణRamagundam: ఆర్వో ప్లాంటులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Ramagundam: ఆర్వో ప్లాంటులను ప్రారంభించిన ఎమ్మెల్యే

సింగరేణి యాజమాన్యం సహకారంతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు

సింగరేణి యాజమాన్యం సహకారంతో కార్మిక కాలనీలలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్, యైటింక్లైన్ కాలనీ సంతోష్ నగర్, 19వ డివిజన్ పోతన కాలనీలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ల ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే చందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే శుద్ధమైన నీటిని త్రాగాలని.. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఫిల్టర్ బెడ్ నుంచి వచ్చే నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. సింగరేణి యాజమాన్యం సహకారంతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి కార్మిక కుటుంబాలకు, ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధమైన నీటిని అందించాలన్నారు. గతంలో గుంతల రోడ్లతో, కల్వర్టుతో యైటింక్లైన్ కాలనీ, పోతన కాలనీ వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పోతన కాలనీవాసుల అభ్యర్థన మేరకు కల్వర్టును తొలగించి బ్రిడ్జిని ఏర్పాటు చేయించానని, సౌకర్యవంతమైన రోడ్లు, మార్కెట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యాధులుప్రబలే వర్షాకాలంలో ప్రజల తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని.. సింగరేణి సహకారంతో యుద్ధ ప్రాతిపదికన ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను సైతం పరిష్కరించడం జరిగిందన్నారు. గత ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాబోయే కాలంలో సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.20 కోట్లతో ఫిల్టర్ బెడ్ ను నిర్మించి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నీటిని ఫిల్టరైజేషన్ చేసి, స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే కార్మిక కుటుంబాల శుభకార్యాల కోసం రూ.2.50 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రజల అవసరాలకు, సౌకర్యాలకు తాను ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, రామగుండం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో ఆర్జీ -2 జి.యం. మనోహర్, కార్పొరేటర్లు సాగంటి శంకర్, తాళ్ల అమృతమ్మ-రాజన్న, బాదె అంజలి దేవి, బిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మేడి సదానందం, అయిలి శ్రీనివాస్, గౌస్ పాషా, పులి రాకేష్, సారయ్య నాయక్, ఓరుగంటి శంకర్, పొయిల సంపత్, ఎరవెల్లి గోపాలరావు, గొడిసెల రవి, మోహన్, కుమార్ నాయక్, జక్కుల దామోదర్, ప్రభాకర్ రెడ్డి, బేతి చంద్రయ్య, రమేష్ రెడ్డి, విజయ, స్వరూప, రోజా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News