Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Chandrayan 3: భారత్‌ కీర్తి పతాక చంద్రయాన్‌ -3

Chandrayan 3: భారత్‌ కీర్తి పతాక చంద్రయాన్‌ -3

చంద్రయాన్‌ -3లో ఒక రోవరు, ఒక ల్యాండర్‌ ఉంటాయి

అంతరిక్షంలోనూ భారత్‌ దూసుకుపోతోంది. ఇప్పుడు జాబిల్లి రహస్యాల అన్వేషణలో భారత్‌ రెడీ అయిపోయింది. చంద్రయాన్‌ -2 దాదాపుగా విజయం సాధించింది. అయితే చివరి అంకంలో విఫల మైంది. దీంతో గతంలోని లోపాలను సరిచేసుకుంది ఇస్రో. పక్కా జాగ్రత్తలు తీసుకుని చంద్రయాన్‌ -3ని రూపొం దించింది. చంద్రయాన్‌ -3 … భారతదేశ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. చంద్రుడి రహస్యాలు తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ఇస్రో. భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రోదసీ యాత్రే… చంద్రయాన్‌ -3. భారత్‌ ప్రారంభించిన చంద్రయాన్‌ సిరీస్‌లో ఇది మూడో యాత్ర. చంద్రయాన్‌ -3తో భారతదేశ కీర్తి పతాక అంతరిక్షంలో ఎగరటం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. కొడితే చం ద్రుడి కుంభస్థలాన్ని కొట్టాలన్న కసితో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌ -3కి రూపకల్పన చేశారు. చంద్రయాన్‌ -2తో నెరవేరని లక్ష్యాన్ని చంద్రయాన్‌ త్రీతో నెరవేర్చాలన్న కసితో ఉన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

- Advertisement -


40 రోజుల అంతరిక్ష ప్రయాణం
చంద్రయాన్‌ -3 అంతరిక్ష ప్రయాణం 40 రోజులు. అంటే ఆగస్టు చివరి వారంలో చంద్రుడిపై చంద్రయాన్‌ -3 ల్యాండింగ్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు ఇస్రో సైంటిస్టులు. చంద్రయాన్‌ -2లో లానే చంద్రయాన్‌ -3లో కూడా ఒక రోవరు, ఒక ల్యాండర్‌ ఉంటాయి. అయితే చంద్రయాన్‌ -3లో ఆర్బిటర్‌ ఉండదు. చంద్రయాన్‌ -3 మిషన్‌ కోసం ఇస్రో మూడు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించు కుంది. వీటిలో మొదటిది.. చంద్రుడి ఉపరితలంపై సుర క్షితంగా, సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అవడం. రెండోది.. చంద్రుడిపై రోవర్‌ సంచరించే సామర్థ్యాన్ని గుర్తించడం. ఇక మూడవ ది చంద్రుడి ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు, సహజ మూలకాలు, నేల, నీరు వీటన్నిటిపై అక్కడే ప్రయోగాలు, పరిశీలనలు చేయడం. వీటితోపాటు చంద్రుడు, భూమి… ఈ రెండు గ్రహాల మధ్య యాత్రలు చేయడానికి అవసరమైన కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం మరో లక్ష్యం.


శివన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓదార్పు
చంద్రయాన్‌ -2ను 2009 జూలై 22న ప్రయోగించింది ఇస్రో. ఇస్రో సైంటిస్టులతో పాటు చంద్రయాన్‌ -2 ప్రయోగాన్ని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ తిలకిం చారు. అయితే చంద్రయాన్‌ -2 చివరిక్షణంలో విఫల మైంది. రాకెట్‌కు ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి ఫలితంగా తీవ్ర భావోద్వేగానికి గురైన అప్పటి ఇస్రో చైర్మన్‌ శివన్‌ కళ్లమ్మట నీళ్లు పెట్టుకున్నారు. దీంతో శివన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు ప్రధాని నరేంద్ర మోదీ. చంద్రయాన్‌ సిరీస్‌… భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌. జాబిల్లి అన్వేషణే చంద్రయాన్‌ సిరీస్‌ ప్రధాన లక్ష్యం. ఈ సిరీస్‌లో మొదటిదైన చంద్రయాన్‌ -1 విజయవంతమైంది. చంద్రుడికి సంబంధించిన విస్తృత సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది చంద్రయాన్‌ -1. ఈ విజయం నేపథ్యంలో ఉరిమే ఉత్సాహంతో చంద్రయాన్‌ -2 మిషన్‌కు శ్రీకారం చుట్టింది భారత అంతరిక్ష పరి శోధనా సంస్థ. జాబిల్లిపై పరిశోధన కోసం రెండో యాత్రకు ఉపయోగించిన నౌకే …చంద్రయాన్‌ -2. ఈ అంతరిక్ష నౌకను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జీఎస్‌ఎల్వీ ఎంకే త్రీ వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్‌ -2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొం దించిన ప్రాజెక్టే అని చెప్పక తప్పదు. అయితే చంద్రయాన్‌ -2 చివరిక్షణంలో విఫలమైంది. కేవలం 90 నుంచి 95 శాతం మేరకే విజయం సాధించిందన్నారు ఇస్రో సైంటిస్టులు. కారణాలేమైనా చంద్రయాన్‌ -2 సంపూర్ణ విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌ -2 లోని లోపాలను గమనంలోకి తీసుకుని సకల జాగ్రత్తలతో చంద్రయాన్‌ -3కి రూపకల్పన చేసింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.


ఇస్రో ప్రస్థానంలో అనేక విజయాలు
స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో అంతరిక్ష పరిశో ధనల్లో భారత్‌ బాగా వెనుకబడి ఉండేది. అప్పట్లో అమె రికా, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగించేది. ఈ నేపథ్యంలో హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. 1969లో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సంస్థ కాస్తా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రోగా అవతరించింది. తొలిరోజుల్లో కేవలం ఉప గ్రహాలను తయారు చేయడానికే ఇస్రో పరిమితమైంది. అయితే తయారు చేయడమే కాదు, వాటిని ఉపయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలని అంతరిక్ష పరిశోధకులు డిసైడ్‌ అయ్యారు. ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌. ఇస్రో తయారుచేసిన తొలి పూర్తిస్థాయి ఉపగ్రహానికి ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టారు. భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్‌ 19న అప్పటి సోనియట్‌ యూనియన్‌ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. 1980ల తరువాత భారత అంతరిక్ష పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఉపయోగించు కోవడానికి వీలుగా పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌… పీఎస్‌ఎల్వీ నిర్మాణాన్ని ఇస్రో చేపట్టింది. 1990వ దశకం లో పీఎస్‌ఎల్వీ రాక, భారత అంతరిక్షకార్యక్రమానికి మంచి ఊపు నిచ్చినట్లయింది. అనేక వైఫల్యాల తరువాత 1994లో చేసిన పీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంత మైంది. అప్పటినుంచి భారత ఉపగ్రహాలకు పీఎస్‌ఎల్వీ స్థిరమైన వేదికగా నిలిచింది. అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో అంతరిక్ష కార్యకలాపాల అవసరాన్ని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే మారుతున్న ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు భారత్‌ కూడా ఎదగాలంటే అంతరిక్ష పరిశోథనలు చేపట్టక తప్పదంటున్నారు అంతరిక్ష శాస్త్ర వేత్తలు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానమే పరిష్కారమంటున్నారు అంతరిక్ష పరిశోధకులు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థది 54 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఇస్రో అనేక విజయాలను నమోదు చేసుకుంది. దీంతో పాటు దేశీయ అవసరాల కోసం అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని అద్భు తాలు చేయడానికి సన్నద్ధం అవుతోంది.
ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌

  • 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News