రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్న పేట మండలం ఇస్కిల్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 80 మంది ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందెల యాదయ్య ఎంపీటీసీ వేమవరం సుధీర్ బాబు గ్రామ శాఖ అధ్యక్షుడు పైల్ల ప్రతాపరెడ్డి వార్డు మెంబర్లు కావటి లింగయ్య సుర్కంటి నరేందర్ రెడ్డి నాయకులు ఎడ్ల సురేష్ వల్ల మళ్ల సూర్యప్రకాష్ వల్లమళ్ల ఆనందు పోషబోయిన సత్తయ్య పోశబోయిన నర్సింహా, జిల్లా వెంకయ్య, బందెల శంకర్, బందెల దుర్గ రామ్, వెల్లంల గిరి, కావేటి సత్య, బందెల రవి, ఉపేందర్, మాసంపల్లి శివ, దండింపల్లి శ్రీను, పాపయ్య, మహేష్, తిరుపతి, బాల రాజ్, సైదులు వెంకన్న, శివ ఉన్నారు.