Friday, November 22, 2024
Homeహెల్త్Scars gone: ఎలాంటి మచ్చలైనా పోతాయోచ్

Scars gone: ఎలాంటి మచ్చలైనా పోతాయోచ్

పెద్ద టైం పట్టదు, ఈజీ, ఖర్చు లేకుండా ఇంట్లోనే బ్యూటిఫుల్ గా తయారవ్వండి

ఈ మాస్కుతో ఎలాంటి మచ్చలైనా ఇట్టే పోతాయట…
మీ ముఖంపై ముడతలు ఉన్నా, ఎలాంటి రకాలైన మచ్చలు ఉన్నా అవి ఈ మాస్కుతో ఇట్టే పోతాయట. ఇంతకూ ఆ మాస్కు ఎలా తయారు చేసుకోవాలంటారా? సింపుల్ ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ జాజికాయ పొడి, ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని రెడీ పెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటినీ కలిపి చిక్కటి పేస్టు తయారుచేసుకోవాలి. సెన్సిటివ్ చర్మం వాళ్లు తేనెను మరికొంత ఎక్కువగా ఈ పేస్టులో కలుపుకోవచ్చు. కారణం తేనె చర్మం వాపును తగ్గిస్తుంది. రొసాసియా ఉన్నవాళ్లు మాత్రం తేనె వాడొద్దు. ఎందువల్ల అంటే ఇది రక్తనాళాలను వెడల్పు చేస్తుంది.

- Advertisement -

పైన చెప్పిన పదార్థాలన్నింటినీ కలిపి తయారుచేసిన ఈ పేస్టు మరీ చిక్కగా ఉంటే దానికి గ్రీన్ లేదా వైట్ క్లేని, కొద్ది నీళ్లను జోడించవచ్చు. అలా తయారు చేసుకున్న పేస్టును అప్లై చేసుకునే ముందు ముఖాన్ని నీళ్లు, సబ్బులతో బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీరు నిత్యం వాడే మాయిశ్చరైజర్ ని ముఖానికి పూసుకోవాలి. ఈ మాస్కును చర్మం దెబ్బతిన్న ప్రదేశాల్లో రాయాలి.

కొద్దిగా చురుకు అనిపించినా కంగారుపడొద్దు. అలా అనిపిస్తే మాస్కు చర్మంపై పనిచేస్తోందని అర్థం. ఈ పేస్టును చర్మంపై అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్టు చేసుకుంటే మంచిది. ఎలాంటి మచ్చలనైనా మటుమాయం చేసే ఈ మాస్కు గురించి చర్మ నిపుణుల సలహాను కూడా తీసుకుని ప్రయత్నించి చూడండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News