బుల్లిపాపాయికి స్నానం చేయించాలంటే…
నవజాత శిశువుకు స్నానం చేయించడమంటే ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అందులోనూ ఇప్పటి యంగ్ అమ్మలకు ఈ పని పెద్ద సవాలుతో కూడిన విషయం అనడంలో సందేహం లేదు. అయితే దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే మీ బుల్లి చిన్నారికి స్నానం చేయించడం ఎంతో సులువు. ఈ క్రమంలో కొత్త అమ్మలకు ఎన్నో సందేహాలు సహజంగా వస్తుంటాయి. పుట్టిన చిన్నారికి ఎంత తరచుగా స్నానం చేయించవచ్చు అనేది వాటిల్లో ఒకటి. అలాగే నవజాత శిశువులకు సబ్బును ఉపయోగించి స్నానం చేయించవచ్చా అనే సందేహం కూడా యంగ్ తల్లులను వేధిస్తుండే మరో ప్రశ్న. సబ్బు ఉపయోగించవచ్చు అంటే ఎలాంటి సబ్బు ఉపయోగించాలి అన్నది మరో సందేహం.
బొడ్డుతాడు ఉన్నప్పుడు స్పాంజ్ బేదింగ్ చిన్నారికి చేయించాలి. ఇందుకు బాంబూ వైప్స్ వాడొచ్చు. ఆర్గానిక్ వాష్ క్లోత్ కూడా ఉంటాయి. పసిపాపను వీటితో తల నుంచి పాదాల వరకూ శుభ్రంగా తుడవాలి. ముఖం, చంకలు, చెవుల వెనక, గడ్డం కింద ఇలా అన్ని చోట్ల సున్నితంగా శుభ్రంచేయాలి. చేతులను కూడా క్లీన్ గా ఉంచాలి. ఇందుకు వాష్ క్లోత్ కు సోపును అప్లై చేసి వాడొచ్చు. బేబీ సోప్ పనికి వస్తుంది. వాష్ క్లోత్ మీద సబ్బురాసి బేబీని శుభ్రం చేసిన తర్వాత గోరువెచ్చటి నీళ్లల్లో ముంచిన వాష్ క్లోత్ తో సబ్బు పోయే దాకా శరీర భాగాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు తుడవాలి. బొడ్డుతాడు తీసేసిన తర్వాత బేబీని స్నానాల తొట్టెలో బెట్టి స్నానం చేయించవచ్చు. నిజానికి చిన్నారులకు సబ్బు ఉపయోగించాల్సిన అవసరం ఏమీ అంత ఉండదు కూడా. వారికి మూడు రోజులకొకసారి స్నానం చేయించవచ్చు.
రాత్రి స్నానం చేయిస్తే గానీ నిద్రపోని చిన్నారులు ఉంటారు. అలాంటి వారికి స్నానం చేయించవచ్చు. పిల్లలకు రిలాక్సేషన్ అవసరమైతే కూడా స్నానం చేయించవచ్చు. ఈ బిజీ కాలంలో తగినంత సమయం లేకపోతే మూడు రోజుల కొకసారి చిన్నారులకు స్నానం చేయించవచ్చు. చిన్నారులకు ముందే చెప్పినట్టు స్పాంజ్ బాత్ చేయించవచ్చు. బేబీని బాత్ టబ్ లో స్నానం చేయిస్తుంటే దాన్ని నిత్యం బాగా శుభ్రంగా పెట్టుకోవాలి. బాత్ టబ్ పొడిగా ఉండేలా చూసుకోవాలి. బాత్ టబ్ ను ఉపయోగిచనప్పుడు దాన్ని నాణ్యమైన క్లీనర్ తో స్ప్రే చేయాలి. అలాగే చిన్నారులను శుభ్రం చేయడానికి ఆల్కహాల్ వైప్స్ వాడడం మంచిది. హైడ్రోజెన్ పెరొగ్సైడ్ వైప్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా బేబీకి మంచిది. ఇవి బేబీని పరిశుభ్రంగా ఉంచుతాయి. బాత్ టబ్ లో బేబీని స్నానం చేయించేటప్పుడు వాష్ క్లోత్స్ ఉపయోగిస్తుంటే సబ్బు తరచూ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. తల నుంచి పాదాల వరకూ బేబీని నీటితో శుభ్రం చేయాలి. ఇందుకు స్వచ్ఛమైన నీటిని వాడాలి.
చిన్నారుల కళ్ల చుట్టూ జాగ్రత్తగా క్లీన్ చేయాలి. గోరువెచ్చటి నీళ్లతో బేబీని స్నానం చేయించాలి. చెవుల వెనుక బాగా కడగాలి. బేబీ వెంట్రుకలను కూడా శుభ్రంగా కడగాలి. బేబీ మాడును సున్నితంగా చేతులతో రుద్దాలి. చెవిలో గులుబులాంటిది ఉంటే రెండు చెవులకు విడి విడిగా సేఫ్టీ స్వాబ్ ఉపయోగించాలి. చెవులను శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బేబీని స్నానం చేయించేటప్పుడు పక్కన పెద్దవాళ్లను ఉంచుకుని చేయిస్తే అదే అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే మంచిది. వారు చక్కటి సలహాలను మీకు ఇస్తారు. అలా కూడా సురక్షితంగా మీ లిటిల్ బేబీకి స్నానం చేయించగలరు. అలాగే ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ల సలహాలను కూడా తీసుకొని పాటిస్తే మంచిది. అలా చేయిస్తే మీ బేబీకి ఆరోగ్యకరమైన పద్ధతిలో స్నానం చేయించగలరు. దీంతో బేబీ మరింత అందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా తయారవుతుందనడంలో సందేహం లేదు…