Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: అభివృద్ధి-సంక్షేమ పాలన దేశానికి ఆదర్శం

Nandyala: అభివృద్ధి-సంక్షేమ పాలన దేశానికి ఆదర్శం

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యం

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతున్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పారవిచంద్రకిషోర్రెడ్డి, కాటసానిరాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, రామసుబ్బారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మాబునిస పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నామని వారు తెలిపారు. అలాగే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని ప్రతిపక్ష నాయకులు, జనసేననేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై అనవసర వ్యాఖ్యలను చేయడంపై వారు మండిపడ్డారు. నంద్యాల నియోజకవర్గంలో జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా నేటికి 22వేలకు పైగా సర్టిఫికెట్లను ప్రజలు అందజేయడం జరిగిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు శిల్పారవిరెడ్డి, కాటసానిరాంభూపాల్రెడ్డి, ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు ఇసాక్ బాష, రామసుబ్బారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రం వ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతున్నదనారు.

- Advertisement -

నంద్యాల నియోజకవర్గ స్థాయిలో నేటికి 42 సురక్ష క్యాంప్లలో 22వేలకు పైగా సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలతో దుర్మార్గంగా పవన్ ప్రవర్తించిన తీరును వారు ఎండగట్టారు. నేటికి సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం నెరవేరుస్తామని తెలిపారు. నంద్యాల పట్టణానికి సంబంధించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి వివరించారు. ప్రధానంగా మెడికల్ కళాశాల నిర్మాణం, ప్రభుత్వ హాస్పటల్ ఆధునీకరణ, అదనపు ఓపీ బ్లాక్ నిర్మాణం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం, నంద్యాల జిల్లాగా ఏర్పాటు, మిర్చియార్డు ఏర్పాటు, తిరుపతికి నంద్యాల నుండి రైల్ సౌకర్యం, పేదలను ఇళ్ల స్థలాల పంపిణీ అందుకు చేసిన శ్రమ, కృషి, గ్రామాల్లో జగనన్న కాలనీల ఏర్పాటు, ఆర్డీటీ ద్వారా పట్టణంలోని ఏవీ నగర్లో ఇళ్ల నిర్మాణం, నాడు నేడు పనుల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల నిర్మాణాలు, ఏపీ మోడల్ స్కూల్ నిర్మాణం పనుల ప్రారంభం, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నిర్మాణం, డిగ్రీ కళాశాల అదనపు గదులు, ఆడిటోరియం, బాలుర జూనియర్ కళాశాల అదనపు గదుల నిర్మాణం, ఐటీఐ కళాశాల, గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణం, కళాశాలలో డిజిటల్ లైబ్రరీలు, పట్టణంలో సుందరమై పార్కులు, మినరల్ వాటర్ ప్లాంట్లు, గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హైవేల నిర్మాణం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలకు ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. అభివృద్ధి కనబడుతున్నా కనబడనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో నూటికి నూరు శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడం తథ్యం అన్ని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపడుతున్న శ్రమను అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని మంచి చేసిన ప్రభుత్వానికి పట్టంకట్టాలని కోరా. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీడీసీఎల్ డైరెక్టర్ డా. శశికళారెడ్డి, వ్యవసాయమార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వరెడ్డి, శాంతిరాం సంస్థల డైరెక్టర్ మిద్దె శివరాం, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News