దోర్నిపాడు మండలం చాకరాజవేముల గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో శాసన సభ్యులు గంగుల బిజెంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకుని ఇంకా సంక్షేమ పథకాలు అందని వారు అర్హులై ఉండి సచివాలయంలో తెలపాలని అధికారులు వెంటనే స్పందించి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తారన్నారు. ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ప్రజల సమస్యలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించినట్లు మరే ప్రభుత్వం స్పందించ లేదనేది జగమెరిగిన సత్యమన్నారు. సమస్యలను ఎమ్మెల్యేగా తాను స్వయంగా ఇంటింటికీ వెళ్లి మరీ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. అలాగే ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని 11 సర్టిఫికెట్లను ఉచితంగా అందజేస్తారని మండలంలో ప్రతి సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, తమ పథకాలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఈ కార్యక్రమం ద్వారా పొందవచ్చని ఎలాంటి ఫీజులు లేకుండా అప్లై చేసుకున్న వెంటనే సంబంధిత అధికారులు మీకు కావాల్సిన సర్టిఫికెట్లను అందజేస్తారని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథరెడ్డి భూమా చెంచు రెడ్డి , నాగేశ్వర యాదవ్ ఎమ్మార్వో జయప్రసాద్ , వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.
Gangula: సమస్యలను పరిష్కారం మన ప్రభుత్వంతోనే సాధ్యం
ఇంటింటికీ వెళ్లి మరీ సమస్యలను తెలుసుకుని..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES