Friday, September 20, 2024
HomeతెలంగాణKaushik Reddy: మూడు పంటలు కావాలా?మూడు గంటలు కావాలా?

Kaushik Reddy: మూడు పంటలు కావాలా?మూడు గంటలు కావాలా?

మతం పేరిట మాటలు కావాలా?

మూడు పంటలు కావాలా… మూడు గంటలు కావాలా.. మతం పేరిట మాటలు కావాలా అనేది హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలను నిరసిస్తూ సాయంత్రం ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇల్లందకుంట, శ్రీరాములపల్లి, గడ్డివానిపల్లి, టేకుర్తి చిన్నకోమటిపల్లి గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ లాంటి దుష్టశక్తులు ఎన్ని వచ్చినా రైతులను కాపాడుకునే నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రైతే రాజు అన్న ముఖ్యమంత్రి గురించి ఆలోచించాలన్నారు. రైతులందరు రాత్రులంత కరెంట్ కోసం పడిగాపులు గాసిన రోజులు చూసామని,
తెలంగాణ ఉద్యమమే కరెంట్ మీద పుట్టిందన్నారు. 2001 నాడు కరెంట్ కోసం ఉద్యమం ఎత్తుకున్నది కెసిఆర్ అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు మూడు గంటల కరెంట్ కావాలా..? మత పిచ్చి లేపే బీజేపీ ప్రభుత్వం కావాలా..? మూడు పంటల ప్రభుత్వం కావాలా..? తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా హుజురాబాద్ నియోజకవర్గనికి లక్ష 17 వేల ఎకరాలకు నీరందిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసిఆర్ అని, రైతుబంధు, రైతు బీమా, 24 ఉచిత కరెంట్, ఆసరా పెన్షన్, ఇతర పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. తాను మాట్లాడిన మాటలతో ఎదో కులాన్ని దుశించినట్లు మాట్లాడుతున్నారు, కానీ అది నిజం కాదన్నారు. ఏది ఏమైనా బి ఆర్ ఎస్ జెండా హుజురాబాద్ లో ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -


చిల్లరగా సోషల్ మీడియా లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సర్వే చేస్తే కౌశిక్ గెలుస్తాడని అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, కౌశిక్ కు ఒక్క చాన్స్ ఇవ్వండి మీ అభివృద్ధి నేను చేసి చూపిస్తా అది నా బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ తో పాటు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పిఎసిఎస్ డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News