Thursday, April 10, 2025
Homeనేషనల్Road Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

Road Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

- Advertisement -

Road Accident: యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. లూథియానా నుండి రాయబరేలి వెళ్తున్న బస్సు ఫిరోజాబాద్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా మరో 21 మంది గాయపడ్డారు. లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే పై ఈ ప్రమాదం జరిగగా.. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తుంది.

ఎక్స్ ప్రెస్ వే పై వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చిన్నపాటి లోయలో పడిపోవడంతో బస్సులోని ప్రయాణీకుల్లో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణీకులున్నారు. చనిపోయిన వారిలో 26 ఏళ్ల యువతి, సంవత్సరం వయస్సున్న ఆమె కుమారుడు కూడా ఉన్నారు. గాయాల పాలైన 21 మందిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

బస్సు ప్రమాదం సమాచారం అందుకున్న వేంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి, సహాయ చర్యలు చేపట్టారని ఎస్పీ రణ్ విజయ్ సింగ్ తెలిపగా.. చనిపోయిన వారిలో నలుగురిని గుర్తించామన్నారు. వారిని 26 ఏళ్ల రీనా, ఆమె సంవత్సరం కుమారుడు అయాంశ్, 25 ఏళ్ల రాజేశ్, 70 ఏళ్ల సంత్ లాల్ గా గుర్తించామన్నారు. రాజేశ్ ది ఫతేపూర్ జిల్లాగా, సంత్ లాల్ ది కౌశంబి జిల్లాగా తెలిసిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News