Friday, September 20, 2024
HomeతెలంగాణChirumarthi: ఉచిత విద్యుత్‌ను రద్దు చేసే దుర్మార్గపు ఆలోచనలో కాంగ్రెస్

Chirumarthi: ఉచిత విద్యుత్‌ను రద్దు చేసే దుర్మార్గపు ఆలోచనలో కాంగ్రెస్

రైతులతో పెట్టుకున్న వాళ్లకు డిపాజిట్లు కూడా రావు

రామన్నపేట పట్టణ కేంద్రంలోని రైతులతో రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలని తెలంగాణ రైతాంగాన్ని అపహాస్యం చేస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, బీ.అర్.ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు చేపట్టిన నిరసనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు

- Advertisement -

ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ…
రైతులను పక్షపాతి అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించి రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించి అన్ని విధాలా రైతులని ఆదుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం లో రైతులు మంచి పంటలు పండిస్తూ సుఖ సంతోషాలతో ఉన్నారని స్పష్టం చేశారు.టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ వారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది చౌకబారు విమర్శలు చేస్తున్న
రేవంత్‌ రెడ్డి తెలంగాణ రైతాంగానికి తక్షణమే క్షమాపణ చెప్పి చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి వాక్యాలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే తెలంగాణలో ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనలో కాంగ్రెస్‌ ఉన్నది. రైతులతో పెట్టుకున్న వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. రైతులను వ్యతిరేకించే కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ టిఆర్ఎస్ మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం సర్పంచులు గుత్తా నర్సిరెడ్డి ఉప్పు ప్రకాష్ కోళ్ల స్వామి అప్పం లక్ష్మీనరసింహ ఎంపీటీసీలు గొరిగి నరసింహ దోమల సతీష్ ఎండి అమీర్ ఉపసర్పంచ్ పొడిచేడు కిషన్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయి నాయకులు బందెల రాములు నీల దయాకర్ బదుల రమేష్ బత్తుల వెంకన్న పున్న వెంకటేశం బొక్క పురుషోత్తం రెడ్డి పోలిబోయిన నరసింహ గోగు సత్యనారాయణ కడమంచి స్వామి కన్నెబోయిన ఐలయ్య ఎండి ఇనాయత్ రాయిని రమేష్ ఆవుల శ్రీధర్ జెట్టి శివప్రసాద్ నోముల శంకర్ బండ దామోదర్ రెడ్డి జెట్టి సైదులు ఎడ్ల సురేందర్ రెడ్డి ముక్కామల సత్తయ్య ఎండి అస్లాం బేగ్ ఎండి నాజర్ బాసాని రాజు చెరుకు ఉపేందర్ గాదే రాము పులిపలుపుల వీరస్వామి అనంత చారి కొండూరు శంకర్ బొల్లం సతీష్ పావురాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News