Sunday, October 6, 2024
HomeతెలంగాణMahabubabad: తండవాసుల చిరకాల కోరిక నెరవేర్చిన మంత్రి సత్యవతి

Mahabubabad: తండవాసుల చిరకాల కోరిక నెరవేర్చిన మంత్రి సత్యవతి

ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలనేది కేసీఆర్ అభిమతం

మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం, నర్సతండా గ్రామపంచాయతీ పరిధిలోని పెద్ద తండా నుండి మాన్య తండా వరకు రాష్ట్ర గిరిజన,స్త్రీ — శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ 1 కోటి 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణమునకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సిఎం కెసిఆర్ ఆదేశమని మంత్రి తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నదని మంత్రి తెలిపారు. పెద్ద తండా, మాన్య తండా ప్రజల చిరకాల వాంఛ అయిన బీటీ రోడ్డు కల నెరవేరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, పెద్డతండా సర్పంచ్ గుగులోత్ వనజా శ్రీరామ్ నాయక్, కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, బయ్యారం PACS చైర్మన్ మూల మధుకర్ రెడ్డి , బిఆర్ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, కొమ్మినేని రవీందర్, కొంపెల్లి శ్రీధర్ రెడ్డి, తాళ్లూరి హనుమ, కిషన్ నాయక్, మాన్యు, బొడ శ్రీను, జీవన్, కోబల్ నాయక్, హరీ రం, మంగిలాల్, మోహన్, రమేష్, డా.సుందర్ నాయక్, వెంకట్ గౌడ్, భరత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News