Saturday, November 23, 2024
HomeతెలంగాణSatish Kumar: పేదలకు కొండంత అండ కళ్యాణ లక్ష్మి పథకం

Satish Kumar: పేదలకు కొండంత అండ కళ్యాణ లక్ష్మి పథకం

రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నాం

చిగురుమామిడి మండల పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద 15 లక్షల 1వేయి 740 రూపాయల విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. చిగురుమామిడి మండలంలో ఇప్పటి వరకు 1517 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 14 కోట్ల 33 లక్షల 73 వేల 460 రూపాయల చెక్కులు పంపిణీ చేశామన్నారు.

- Advertisement -

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనమామ కట్నంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని,పేద మధ్య తరగతి కుటుంబాలకు పెళ్లి ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఆడబిడ్డలకు ఎంతగానో ఉపయోగపడుతుందని,
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్‌ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అనంతరం 12 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైనా 3 లక్షల 96 వేల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజలు అనారోగ్యంనికి గురైనప్పుడు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మందికి ఉపయోగ పడుతుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేర్కొన్నారు.

ఆసరా ఫింఛ‌న్‌ , రైతుల కోసం రైతు బంధు. రైతు భీమా, 24 గంటలు ఉచిత కరెంట్ , పేదల కోసం షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాలు ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఆలోచించలేదు. ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే త‌ల్లిదండ్రులకు త‌ల‌కు మించిన భారంగా ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటు వారి పిల్లల పెళ్లిళ్లకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు.

సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. ప్రజలకు కావాలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన కళ్యాణలక్షీ పథకం ఆడపిల్లకు ఓ వరం లాంటిదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన పథకం ఉండడం ఎంతో గర్వంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటు కేసీఆర్ కిట్టు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి ,జెడ్పిటిసి గీకురు రవీందర్ ,సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి ,తాసిల్దార్ జయంత్ ,ఎంపీడీవో నరసయ్య ,వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి ,హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామోజీ రజిత కృష్ణమాచారి ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య , జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి నాయకులు పెద్దపల్లి అరుణ్ కుమార్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News