హుస్సేన్ సాగర్ లో నిర్వహిస్తున్న మాన్ సూన్ రెగట్ట మొదటి రోజు అల్లరించింది. దాదాపు ఒక నెల పాటు వర్షాల పరిస్థితులకు సుదీర్ఘ విరామం తర్వాత మాన్సూన్ రెగట్టా మొదటి రోజున గాలులు హుస్సేన్ సాగర్ను బలంగా తాకడం సంతోషంగా ఉందని యాచ్ క్లబ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు సుహీమ్ షేక్ అన్నారు. వర్షం,తుఫాను పరిస్థితులతో 20 నాట్లకు పైగా గాలులు వీస్తోన్న వేళ ప్రారంభమైన 14 వ యాయ్ మాన్సూన్ రెగట్టా ఇంటర్నేషనల్ రేస్ ఆఫీసర్ శ్రీకాంత్ చతుర్వేది రేసులను గంటకు పైగా వాయిదా వేశారు. తర్వాత అండర్ 19 ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ క్లాస్,నేషనల్ ర్యాంకింగ్ అండర్ 15 ఫ్లీట్ ఆఫ్ ఆప్టిమిస్ట్ల కోసం 3 రేసులను పూర్తి చేశారు.