చాగలమర్రి మండలం నగల్లపాడు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో పథకాల గురించి ప్రజలకు తెలుపుతున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో రైతులకు ఎన్ని ఇబ్బందులు వచ్చిన, ఎన్ని సమస్యలు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చిన, రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి రైతుల సమస్యలకు స్పందించి రైతుల సమస్యల పరిష్కారం చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటే రైతే రాజు అవుతాడని చెప్పి రైతులకు మోసం చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే నాధుడు కూడా లేకుండా పోయారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు అయిపోయిన ఇప్పటివరకు రైతుల సమస్యలను పరిష్కరించలేకపోతోంది రైతులకు పంట నష్టం జరుగుతున్న రైతులు ఇబ్బందులు పడుతున్న ఏ ఒక్క రైతు కూడా నష్టపరిహారం చెల్లించని పరిస్థితిలో ఈ YCP ప్రభుత్వం వుందని రైతులు బాగుపడాలన్న రాష్ట్రం బాగుపడాలన మన చంద్రబాబునాయుడు గారు అధికారంలోకి రావాలి కాబట్టి రైతులు, ప్రజలు అందరు గమనించి వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓట్లు వేసి గెలిపించి రైతులను, మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని తెలిపిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.
మాట తప్పను మడమ తిప్పనని ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు మద్యానికి, గంజాయికి అలవాటు పడి బానిసలై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అదే టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి పేదలకు మోసం చేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అదే టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఐదు లక్షల గృహాలు కట్టించిన ఘనత మన TDP నారా చంద్రబాబు నాయుడు గారిది గతంలో టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి ఏమీలేదని అన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.
టిడిపి అధికారంలోకి వస్తేనే ప్రజలకు అందించే పథకాల తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టిడిపి అధికారం లోకి వస్తే మహాశక్తి పథకం కింద 18 సంవత్సరాలు నిండిన స్త్రీలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు అందజేస్తామని అలాగే తల్లికి వందనం పథకం క్రింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15 వేల రూపాయలు అందిస్తాము. అలాగే దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని , మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా టికెట్ లేని ప్రయాణం ఇస్తాము అలాగే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు యువగలం నిది కింద నెలకు 3000 రూపాయలు అందిస్తామని,అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూపాయలు హార్దిక సాయం అందిస్తామని , బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా టిడిపి ప్రభుత్వం నిలుస్తుందని అంతేకాకుండా ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందిస్తామని ఐదు సంవత్సరాలలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసి పేదలను సంపన్నవంతులుగా చేస్తామని చంద్రబాబునాయుడు మహానాడు సభలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు అంతేకాకుండా టిడిపి అధికారంలోకి వస్తే ప్రజలకు ఉపయోగపడే మరెన్నో పథకాలను అమలు చేస్తామని ఇప్పుడు విడుదల చేసిన పథకాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుందన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సర్ బాషా , బిసి సేల్ నంద్యాల నియోజకవర్గ ఇంచార్జీ సల్లా నాగరాజు , కసినేని ఓబులేసు , యంగ్ అండ్ డైనమిక్ తెలుగేశం పార్టీ యువ నాయకురాలు శజ్ఞా రెడ్డి , పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.