Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Drought like situation: కోరలు చాస్తున్న కరువు ఛాయలు

Drought like situation: కోరలు చాస్తున్న కరువు ఛాయలు

ఉత్తరాదిన అతివృష్టి, దక్షిణాదిన అనావృష్టి

అన్నదాతల ఇంట్లో సిరులు కురిపిస్తూ దేశం, రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందేలా చేసే వానా కాలం సీజన్‌ గడిచిపోతుంది. మన దేశంలో ఉత్తరాదిన అతివృష్టి, దక్షిణాదిన అనావృష్టి తాండవించే చాయలు కమ్ముకున్నాయి. ఈ సీజన్లో వాతావరణ పరిస్థితులు, అడపా దడపా పడే వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు చేయడంలో అనూహ్య పరిణామాలు కొనసాగుచున్నాయి. జూన్‌/జూలై నెలలో నేటికీ వర్షాలు లేకపోవడంతో విత్త నాలు వేసినా మొలకెత్తక పోవడం, అక్కడక్కడ మొలకెత్తి నవి వర్షాలు లేక ఎండిపోవడం జరుగుతుంది. వరి నారు పోసిన తర్వాత ఎండిపోవడంతో రైతులు మళ్లీ మళ్లీ విత్త నాలు, వరి నార్లు పో(వే)యాల్సి వస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 36 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అయ్యాయని తెలుస్తోంది. అందులో సుమారు 4 లక్షలకు పైగా ఎకరాల్లో దెబ్బతిన్నట్లు తెలు స్తుంది. అందులో వరి 2 లక్షల ఎకరాలు, పత్తి లక్షన్నర ఎకరాలు, మొక్కజొన్న, కంది ఇతర పంటలు కలిపి మరో 50 వేల ఎకరాలలో మూడు సార్లు విత్తనాలు వేయడం గమనార్హం. వర్షాకాలం సీజన్లో అరకొర వర్షపాతంతో రైతులు వారి పొలాలలో మూడుసార్లు విత్తనాలు నాటినవి తడి లేక మొలకెత్తకపోవడంతో రైతులకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఇప్పటికీ వానలు లేక పంటల సాగుకు తీవ్ర ఆలస్యం అవుతుంది. దీనితో రైతులు ప్రతిరోజు విత్త నాలు నాటి మేఘాల వైపు చూస్తున్నారు. ప్రతిరోజు వాతా వరణం మేఘామృతం అవ్వడం.. ఉక్కపోతగా ఉంటుంది కానీ వర్షం మాత్రం పడడం లేదు. ఆకాశం మేఘావృతం కావడమే తప్ప భారీ వర్షాల జాడే లేదు. ఇలా మన రాష్ట్రం లో వర్షాభావ పరిస్థితులతో రాష్ట్ర రైతాంగం బెంబేలెత్తి పోతున్నారు. వర్షం కురవక పోగా, వర్షాకాల సీజన్‌ దాటి పోతున్న తరుణంలో కరువు ఛాయలు కమ్ముకుంటున్నా యని ఆవేదన చెందుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే కరు వును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడానికి సంసిద్ధం కావాల్సి ఉంది.
కరువు అంచనా..
వర్షపాతం ఆధారంగా కరువును అంచనా వేస్తారు. దానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. అది ఇలా లెక్కిస్తారు. వరుసగా ఇరవై ఒక్క రోజులు వర్షం పడకపోతే కరువు ఛాయలు నెలకొన్నట్టుగా భావిస్తారు. అలాగే ఇరవై ఒక్క రోజుల నుండి 28 రోజులు వర్షం కురవ(పడ)కపోతే ‘కరువు’ కింద అంచనా వేస్తారు. ఇకపోతే 28 నుంచి 43 రోజులు వాన రాకపోతే ‘తీవ్రమైన కరువు’గా నిర్ణయిస్తారు. అలాగే పడాల్సిన దానికన్నా 19 శాతం లోపు వర్షపాతం తక్కువ పడితే ‘లోటు’ వర్షపాతంగా, 35 శాతం లోపు పడితే ‘కరువు’ ప్రాంతంగా 35 పైన పడకపోతే ‘తీవ్రమైన కరువు’గా భావిస్తారు. వర్షం పడాల్సిన దానికంటే 25% లోపు ఉన్న జిల్లాలు మన రాష్ట్రంలో ఇప్పుడు 30 జిల్లాలు ఉన్నాయి. 51 శాతం నుంచి 75 శాతం ఆదిలాబాద్‌, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌లో పడింది. వర్షపాతం మొత్తం 119.0 ఎం.ఎం.కు గాను 66.9% పడింది. దీనికి గాను లోటు 44 శాతం తక్కువగా ఉంది. 20శాతం లోపు జిల్లాలు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణ ఖే్‌డ నల్గొండ, నాగర్‌ కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల మేరకు వానాకాలంలో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు వేయాలి. కానీ వర్షాభావంతో సాగు విస్తీర్ణం తగ్గి నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితులు ఇలానే మరో పది రోజు లు కొనసాగితే, వరి మినహా తక్కువ కాలంలో పండే మెట్ట పంటల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. ఆ వైపుగా రైతులను చైతన్య పరచాల్సి ఉందని వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి కరువు పరిస్థి తుల నుండి ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకొని ప్రాజె క్టులు, చెరువులు, కాలువలు వానాకాలం కంటే ముందే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. కొద్దిపాటి వర్షం పడినప్పటికీ ఆ నీరును వృధా కాకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లేలా ప్రణాళికలు, విధి విధా నాలు అమలు జరపాల్సి ఉంది. రుతుపవనాల రాక ఆల స్యంతో పాటు ఎల్‌ ని నో వాతావరణ పోకడ ప్రభావం తో మన దేశంలో 70% వర్షపాతానికి కారణమయ్యే నైరుతి రుతుపవనాలను దెబ్బతీసినట్లు తెలుస్తుంది. వర్షాలు తగ్గడానికి దీని ప్రభావం కావచ్చు అని అంచనా వేస్తు న్నారు. దీనితో ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం ఉం టుంది. దీని మూలంగా పంటల దిగుబడులు తగ్గితే నిత్యవసరాలకు కొరత ఏర్పడవచ్చు.. ఫలితంగా ధరలు పెరగవచ్చు అని తెలుస్తుంది. ఈ ప్రత్యేక అసాధారణ, వాతావరణ పరిస్థితులు, కరువు పరిణామాల నుండి రైతాంగాన్ని, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలను వెంటనే అప్రమత్తపరిచి తాజా పరిస్థితులను ఎప్ప టికప్పుడు అంచనా వేస్తూ, కరువు కోరల నుండి రైతాం గాన్ని, ప్రజలను కాపాడాలి. వెంటనే రాష్ట్రం ఈ ప్రత్యేక నివేదికలు కేంద్రానికి పంపిస్తూ, రాజకీయాల కతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే విపత్తు నుండి ప్రజ లను కాపాడాల్సి ఉంది. మొన్నటిదాకా కరోనా విజృంభన తో ప్రజలు అతలాకుతలమైనారు.. ఇప్పుడిప్పుడే తేరుకుం టున్న వేళ మరో రూపంలో కరువు మేఘాలు కమ్ముకుంటు న్నాయి. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడం ఎంతో అవ సరం. అలా కాకుండా ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహ రిస్తే ఆహార, ఆర్థిక సంక్షోభం వైపు దారి తీస్తుంది. ప్రభు త్వాలకు స్థితప్రజ్ఞత, ముందుచూపు ఎంతో అవసరం. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు’. బత కడం అంటే మనం మాత్రమే జీవించడం కాదు? భరత జాతికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతలా బతకడం. ఆ మహానీయుడికి కరువు కష్టాలు కమ్ముకుంటన్నాయి. రైతులు ఏడ్చిన రాజ్యం పొడుగెల్లదు. ఇది రైతుల ఒక్కరి సమస్య మాత్రమే కాదు. యావత్‌ భారతజాతి సమస్యగా భావించాలి.
మేకిరి దామోదర్‌
సామాజిక విశ్లేషకులు
-95736 66650

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News