Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభమాస్ బీట్ తో వచ్చేసిన వీరసింహారెడ్డి.. సుగుణ సుందరీ అంటూ బాలయ్య స్టెప్పులు

మాస్ బీట్ తో వచ్చేసిన వీరసింహారెడ్డి.. సుగుణ సుందరీ అంటూ బాలయ్య స్టెప్పులు

ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమాలకు బాలకృష్ణ పెట్టింది పేరు. సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా, లెజెండ్, అఖండ.. ఇప్పుడు వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీమూవీస్ బ్యానర్ పై బాలకృష్ణ-శృతిహాసన్ జంటగా.. బాలయ్య డబుల్ రోల్ లో తెరకెక్కుతోందీ సినిమా. ఇప్పటికే వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. తాజాగా మరో మాస్ బీట్ సాంగ్ ను వదిలారు. ‘సుగుణ సుందరి .. సుర సుర సూపుల రాకుమారి’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

- Advertisement -

‘సీమా కుట్టిందే .. సిట్టి సీమా కుట్టిందే.. దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే’ అంటూ సాగే ఈ పాటను బాలయ్య – శ్రుతి హాసన్ పై చిత్రీకరించారు. తమన్ బాణీలు అందించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. రామ్ మిర్యాల, స్నిగ్ద శర్మ పాటను ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కాగా.. పాట మాస్ బీట్ తో ఉండటంతో.. మాస్ ఆడియన్స్ కి వెంటనే కనెక్టవుతుంది. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News