ఖమ్మం ఐడిఓసి లో అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్ కొరకు రూ. 100.78 లక్షలతో నిర్మిస్తున్న సోలార్ పార్కింగ్ షెడ్ నిర్మాణ ప్రగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పరిశీలించారు. పనులు పురోగతిలో ఉన్నట్లు, 6 షెడ్ల నిర్మాణానికి గాను 3 షెడ్ల నిర్మాణం పూర్తయినట్లు ఆయన అన్నారు. పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ సోలార్ షెడ్ తో 100 కిలో వాట్ సోలార్ పవర్ ప్లాంట్, గ్రిడ్ కు అనుసంధానం చేస్తారని కలెక్టర్ తెలిపారు.