Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్కాటసాని రామిరెడ్డి గజమాలలతో ఘన స్వాగతం

కాటసాని రామిరెడ్డి గజమాలలతో ఘన స్వాగతం

గడప గడపకులో ఎమ్మెల్యే

బనగానపల్లె నియోజకవర్గంలో అవుకు మండలం వేములపాడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గజమాలలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. అనంతరం జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి తెలియజేస్తూ అలాగే గ్రామ సమస్యలను స్వయంగా ప్రజలతోనే తెలుసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే ధ్యేయంతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందినట్లు చర్యలు తీసుకున్నారన్నారు.

- Advertisement -

వైయస్సార్ ప్రభుత్వంలో పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని, అయితే గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందివని నేడు అర్హులైన ప్రతి పేదవానికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా నిత్యం ప్రజల కోసం కష్టపడే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 కి 175 స్థానాల్లో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అప్పుడే అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి మండల తహసిల్దారు ,మండల అధికారులు,వేములపాడు గ్రామ మాజీ సర్పంచులు చిందుకూరి సురేష్ కుమార్ ,చిందుకూరి సుబ్రహ్మణ్యం, చిందుకూరి గోపాల్, గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చిందుకూరి చంద్రశేఖర్, చిందుకూరి నాగేంద్రప్రసాద్,,M.శ్రీనివాసులు, దండు ఈశ్వరయ్య,గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు, గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News