గత ఎన్నికలలో షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కృషివల్లే నందికొట్కూరు నియోజవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్ గెలిచారని, నేడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై దళితులను ఉసిగొల్పడం సరికాదని వైఎస్ఆర్సిపి దళిత నాయకులు యటా ఓబులేష్, మార్కెట్ రాజు హెచ్చరించారు. పట్టణంలో ఎమ్మెల్యే ఆర్థర్ అనుచరులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ వైసిపి ఎస్సీ సెల్ విభాగం యటా ఓబులేసు, మార్కెట్ రాజు, రమేష్, మనూపాడు అశోక్ ల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం చెంత పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి దళిత నాయకులు యటా ఓబులేసు మాట్లాడుతూ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతి చిన్న వయసులోనే రాష్ట్రంలో ప్రజాధరణ కలిగిన నాయకునిగా ఎదుగుతున్నాడని, ఆయన కృషి కష్టం వల్లే నియోజవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్ ను ప్రజలు గెలిపించారని, అది విస్మరించే నేడు ఎమ్మెల్యే అనుచరులు సిద్ధార్థ రెడ్డి పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నియోజవర్గంలో అన్ని వర్గాలతో పాటు దళితులను కూడా అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధికి పాటుపడిన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని కొనియాడారు. నియోజవర్గానికి సంబంధంలేని దళిత నాయకులు ఎమ్మెల్యేను అవమానించారంటూ రోడ్లపై ధర్నాలు చేయడం, సిగ్గుచేటని రాజకీయ పరిస్థితులపై అవగాహన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్తర్ ఏనాడైనా పని చేశారా, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వైసిపి కార్యకర్తలైన దళితులను పక్కనపెట్టి టీడీపీకి చెందిన వారిని పెట్టుకుని రాజకీయాలు చేయడం నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. నాటి నుండి నేటి వరకు దళితుల అభివృద్ధిపై ఆలోచన గలిగిన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాంటి నాయకుడిపై అవాకులు, చౌకబారు మాటలు మాట్లాడితే సిద్ధార్థ రెడ్డి అభిమానులుగా చూస్తూ సహించేదే లేదని హెచ్చరించారు. దళిత నాయకులు నాగరాజు నియోజవర్గంలో దళితులకు, వేరే వర్గాలకు చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేయడం మానుకోవాలని నీ బ్రతుకు నీ చరిత్ర అంతా తెలుసునన్నారు. మరోసారి బయట సిద్ధార్థ రెడ్డిపై నోరు పారేసుకుంటే త్యాగరాజు నీ చరిత్ర గుట్టు విప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. నియోజవర్గంలోనే వైసిపి పార్టీలో కష్టపడిన దళితులంతా సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని అందులో భాగంగానే దళితులు ప్రజా ప్రతినిధులుగా చాలా మంది ఎన్నికైయారన్న విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. జాతిని తాకట్టు పెట్టుకుని బ్రోకర్ వ్యవహారం చేసే వ్యక్తి త్యాగరాజని ఆరోపించారు. వైసీపీ పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలు పట్టించుకోని ఎమ్మెల్యే మాకొద్దు అంటూ నినాదంతో ముందుకెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అశోక్, సురేష్, చిన్న రాజు, విజయ్,సుంకన్న, బ్రహ్మయ్య, రాంబాబు లడ్డు పాల్గొన్నారు.
Nandikotkuru: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కష్టమే నీ గెలుపు !
నీ వెనక ఉండేదంతా టీడీపీ నాయకులు