Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుCheryala: సోషల్ వెల్ఫేర్ కాలేజ్ విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాలపై అవగాహన

Cheryala: సోషల్ వెల్ఫేర్ కాలేజ్ విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాలపై అవగాహన

కేసు నమోదైతే 6 నెలల- 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష

విద్యార్థులు ర్యాగింగ్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డి అన్నారు. చేర్యాల సోషల్ వెల్ఫేర్ కాలేజ్ విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం యాక్ట్ 1997 నుండి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ర్యాగింగ్ చేయడం మన సంస్కృతి కాదని, వేర్వేరు జిల్లాల నుండి వచ్చి చదువుకుంటున్న వారిని ఈ విష సంస్కృతికి బలి కాకుండా చూడాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే మంచి ఆశయాలతో విద్యార్థులంతా ముందుకు వెళ్లాలని తెలిపారు. జీవితంలో స్థిరపడాలంటే
కృషి, పట్టుదల, మంచి, మానవత్వం, క్రమశిక్షణ మనిషికి చాలా ముఖ్యమని తెలిపారు. ర్యాగింగ్ చట్టప్రకారం ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని, ర్యాగింగ్ చట్టప్రకారం రెండు విధాలుగా అమలు చేయవచ్చని మొదట కాలేజీ ప్రిన్సిపల్ కాలేజీ నుండి సస్పెండ్, రిమూవ్ చేసే అధికారం ప్రిన్సిపల్ కి ఉంటుందని తెలిపారు. రెండవది ర్యాగింగ్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ర్యాగింగ్ అంటే వ్యక్తులను, వ్యక్తిని అవమానపరచుట, భయపెట్టి, భయం కలిగేటట్లు చేయటం, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించి, కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని తెలిపారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సేవలు అందిస్తుందని ప్రతి ఒక్కరూ నిర్భయంగా పోలీసులకు ఫోన్ చేయవచ్చు, పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వవచ్చు, లేదా డయల్ 100, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ద్వారా సమాచారం అందించిన తక్షణమే స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ అశోక్ బాబు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News