Friday, September 27, 2024
HomeతెలంగాణKaushik Reddy: 3 గంటల కాంగ్రెస్ ను, మత పిచ్చి బీజేపీని తరిమికొడదాం

Kaushik Reddy: 3 గంటల కాంగ్రెస్ ను, మత పిచ్చి బీజేపీని తరిమికొడదాం

మూడు పంటల బీఆర్ఎస్ ను గెలిపిద్దాం

వ్యవసాయ రంగానికి మూడు గంటల విద్యుత్తు చాలంటున్న కాంగ్రెస్ ను, మత పిచ్చి లేపే బీజేపీను తరిమి కొట్టి.. మూడు పంటల బిఆర్ఎస్ ను ఆదరించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలోని రైతు వేదికలో వావిలాల, నగరం, నాగారం, పాపకపల్లి గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఐదు దశాబ్దాల పాలనలో రాష్ట్రంలో విద్యుత్తు, సాగునీటి సౌకర్యం సరిగా ఉండేది కాదని ఎరువుల, పురుగుల మందుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ రైతులకు విద్యుత్ కష్టాలు తీర్చామని అన్నారు.

- Advertisement -

రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు మూడు గంటల కరెంట్ కావాలా..? మత పిచ్చి లేపే బీజేపీ ప్రభుత్వం కావాలా..? మూడు పంటల ప్రభుత్వం కావాలా..? తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సాగిస్తున్న పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఇది చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, 24 ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్, ఇతర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన 27 మంది సర్పంచులు రాష్ట్రంలో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఇలాంటి నాయకుడు తమ రాష్ట్రాన్ని పాలిస్తే బాగుండు అని వారు అనడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణం అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యుత్ సరఫరా విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు. రైతును రాజు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర రైతాంగం సంపూర్ణ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నూరైనా బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యుడు శ్రీరామ్ శ్యామ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు మర్రి మల్లేశం, మండల కో ఆప్షన్ సభ్యులు రఫీ, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లింగారావుతో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News