Friday, September 20, 2024
HomeతెలంగాణKangti: రోడ్ వేస్తేనే ఓట్ వేస్తాం

Kangti: రోడ్ వేస్తేనే ఓట్ వేస్తాం

రోడ్డు లేక అల్లాడుతున్న స్థానికులు, పట్టించుకునే నాథుడేడీ?

కంగ్టి మండల కేంద్రం పిట్లం వైపుకు వెళ్లే ప్రధాన రహదారిపై అనేక గుంతలు, బురదతో నిండిపోయింది. ప్రధాన రహదారి అయినా రోడ్డు మాత్రం గుంటను తలపిస్తుంది. రోడ్డుపై అనేక గుంతలు భీకరంగా కంకర రాళ్లు తేలడంతో ప్రజలు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నా స్థానిక నాయకులు ఎంపీపీ గాని జడ్పిటిసి కాని మండల పార్టీ అధ్యక్షులు గాని ఒక్కసారి కూడా ఈ రోడ్డు విషయాన్ని పట్టించుకోకపోవటంపై స్థానికులు భగ్గుమంటున్నారు. ప్రయాణికుల బాధలు పట్టనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నా ఏంటి? లేకున్నా ఏంటి? అని ప్రజలు నిప్పుులు చెరుగుతన్నారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే దగ్గర ఈ విషయాన్ని ఎందుకు తీసుకెళ్లరని ఇక్కడి ప్రజలు మధనపడుతున్నారు. మహిళలు మాట్లాడుతూ ఓట్ల అడుక్కునే సమయంలో గల్లి గల్లి తిరిగి ఇంటింటికి తిరిగి ఎక్కడున్నారో వెతికి ఓట్లు అడుగుతారు కానీ ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఎక్కడ దాక్కుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు? ఓట్ల సమయంలో కాళ్ళ వేళ్ళ పడతారు ఓట్లు కాంగానే ముఖం ఎందుకు చాటేస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు?
రోడ్డు ఆవాలా నీటి బోరు ఉండడంతో బిందెలు ఎత్తుకొని రోడ్డు దాటేటప్పుడు మహిళలు పిల్లలు అనేకసార్లు పడ్డారని మహిళలు చెప్పారు, ఇంత జరిగిన కూడా ఏ ఒక్క నాయకుడు ఇక్కడికి వచ్చి దీనిపైన మాట్లాడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈసారి మాత్రం రోడ్ వేస్తేనే ఓట్లు వేస్తామని రోడ్డు వేసిన తర్వాతనే మా కాలనీలోకి ఓట్ల కోసం రావాలని తెగేసి హెచ్చరించారు. ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ కంగ్టి మండలాన్ని సుందరంగా తీర్చిదిద్దినం అని చెప్పుకొని తిరుగుతున్నారని..ఈ రోడ్డు ఇంత దారుణంగా మారినా కూడా ఏ ఒక్క నాయకులు ఈ రోడ్డుపైన మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో వి.మల్లేష్ మహిళలు ఎల్ హెచ్ పి ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News