Thursday, September 19, 2024
HomeతెలంగాణMusi river: ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి

Musi river: ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి

పోచంపల్లి-జూలూరు రుద్రవెల్లి వంతెనపై రాకపోకలు నిలిపివేత

నిండుకుండలా చెరువులు, వంతెన పైనుంచి ప్రవహిస్తున్న మూసి గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు
భుదాన్ పోచంపల్లిలో. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మూసి నది ఉదృతంగా ప్రవహిస్తుంది, భూదాన్ పోచంపల్లి లోని పెద్ద చెరువు మూసి ప్రవాహానికి నిండుకుండలా మారింది గత రెండు సంవత్సరాల కాలంగా నీళ్లు లేకుండా ఖాళీగా ఉన్న చెరువు ఇప్పుడు నిండుకుండలా మారడంతో రైతులు మత్స్యకారులు సంతోషిస్తున్నారు. మూసి ప్రవాహానికి పోచంపల్లి మండలం జూలూరు రుద్రవెల్లి గ్రామాల మధ్య వంతెన పైనుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో అప్రమత్తమైన పోలీసులు, గ్రామస్తులు భారికేడ్లు అడ్డంపెట్టి రాకపోకలను నిలిపివేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News