Saturday, November 23, 2024
HomeతెలంగాణSrinivas Goud: నిరంతర వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Srinivas Goud: నిరంతర వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08542-241165 కు ఫోన్ చేయండి

గడచిన మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు మహబూబ్నగర్ జిల్లాలో సైతం కురుస్తున్నాయని, ఈ వర్షాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. చెరువులు, కుంటలు,, పెద్ద పెద్ద నాళాల పక్కన ఉన్న ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చేలా ఉంటే తక్షణమే అధికారులకు విషయాన్ని తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08542-241165 కు తెలియజేయాలని, ఇది 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

గతంలో వర్షాలు సరిగా లేక జిల్లాలో కరువు పరిస్థితులు ఉండేవని, అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత హరితహారం, ఇతర కారణాల వల్ల ప్రతి సంవత్సరం మంచి వర్షాలు కురుస్తున్నాయని మంత్రి తెలిపారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాలాలను వెడల్పు చేయటం వంటివి చేస్తున్నామని, అదేవిధంగా గణేష్ నగర్ దగ్గర ఉన్న ఎర్రకుంటకు సంబంధించిన 30,40 ఏండ్ల కిందటి నాలను పూడ్చివేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, తక్షణమే దానిని పునరుద్ధరిస్తామని తెలిపారు. గణేష్ నగర్ నుండి పాత మేనక టాకీస్ వరకు మరో నాలను కోటి రూపాయలతో యుద్ధ ప్రతిపాదికన వారం రోజుల్లో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాక జాతీయ రహదారి పై ఉన్న మరో నాలా పూడుకపోయిందని, దానిని సైతం పూడిక తీసివేసస్తామని తెలిపారు.

గతంలో రామయ్య బౌలి, బికే రెడ్డి కాలనీలు వర్షపు నీటికి మునిగిపోఏవని ,కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా పక్క ప్రణాళికతో వర్షపు నీటిని మళ్ళించడం, నాలాలలో పూడిక తీసివేయడం, వాటిని వెడల్పు చేయటం, ఇంకా విస్తరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏ ఒక్క ఇంటిలోకి వర్షపు నీరు రాలేదని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో వర్షం వల్ల ఇబ్బందులు రానివ్వకుండా పకడ్మంది చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలో మురికి నీటిని శుద్ధి చేసేందుకు, మురికి నీరు సవ్యంగా వెళ్లేలా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 276 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, వచ్చే సంవత్సరం ప్రణాళిక ప్రకారం వీటన్నిటిని పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన కురహిని శెట్టి కాలనీ, బండ్ల గెరి తదితర కాలనీలన్ని వర్షం నీటి వల్ల ఇబ్బందులు పాలు కాకుండా చూడడంతో పాటు, వర్షపు నీరు, మురికి నీరు వేరువేరుగా వెళ్లే విధంగా ఎస్ టిపి లు ఏర్పాట్లు చేస్తామని, చెరువు కట్టను పటిష్టం చేయడం వంటి చర్యలను ఇదివరకే చేపట్టామన్నారు.

పడిపోయెందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లను గుర్తించి ప్రజలను ఖాళీ చేయించి వారికి పునరావాసం కల్పించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. కూలిపోయే ఇళ్లలో ఎవరు ఉండవద్దని, ఎక్కడైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నా ఇండ్ల సమాచారాన్ని తక్షణమే అధికారులకు తెలియజేయాలని, ఈ విషయంలో అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు .భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా సహజంగా నీరు కిందికి వెళ్లిపోయే విధంగా ఏర్పాటు చేయటం తో పాటు, మెయిన్ ట్రంకులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.



మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు,జిల్లా రైతు బంధు కో ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, గొర్రె కాపార్ల సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News