Friday, September 27, 2024
HomeతెలంగాణIllandukunta: రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

Illandukunta: రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

రైతులను కాపాడే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్

రైతును రాజును చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని రైతాంగానికి వ్యవసాయ సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతుబంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ముమ్మాటికి రైతు బాంధవుడేనని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామంలోని రైతు వేదికలో బూజునూర్, వంతడుపుల, రాచపల్లి, సీతంపేట గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర పాలకుల పాలనలో రైతులు వ్యవసాయ సాగుకు కరెంటు ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియక నానా అవస్థలు పడ్డారని, అర్థరాత్రి సమయాలలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. వ్యవసాయ పంటల సాగు సమయంలో అన్నదాతలు పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయించేవారని రైతుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైతులకు వ్యవసాయ సాగులో ఇబ్బందులు తలెత్తకూడదనే సదుద్దేశంతో వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ లాంటి దుష్టశక్తులు ఎన్ని వచ్చినా రైతులను కాపాడే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సాగిస్తున్న పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఇది చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, 24 ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, దళిత బంధు లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అంతకుముందు మండల పరిధిలోని ఇల్లందకుంట, సిరిసేడు, కనగర్తి, సీతంపేట, వంతడుపుల, రాచపల్లి గ్రామాలకు చెందిన 14 మందికి రూ,4 లక్షల 50 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News