Saturday, November 23, 2024
HomeతెలంగాణKolcharam: ప్రతి కిరాణా దుకాణం బెల్ట్ షాపే, ప్రతి హోటల్ బార్ అండ్ రెస్టారెంటే

Kolcharam: ప్రతి కిరాణా దుకాణం బెల్ట్ షాపే, ప్రతి హోటల్ బార్ అండ్ రెస్టారెంటే

నిద్ర మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు

కొల్చారం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెక్కిస్తూ. కుటుంబాలను వీధిన పడేస్తున్నారు.. కొల్చారం మండలంలోని చాలా గ్రామాల లో బెల్ట్ షాపుల దందా మూడు పువ్వుల ఆరుకాయలుగా తయారైంది. ఈ దందా దర్జాగా సాగుతోంది. అధికార కను సైలలోనే ఈ తంతు కొనసాగుతున్నా. ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మండల పరిధిలోని సుమారు 2 వైన్స్ షాపులు కొనసాగుతున్నాయి.సంబంధిత అధికార మామూలు మత్తులో జరుగుతున్నారని. ప్రతి నెల ముడుపులు అండoతో వారి బెల్ట్ షాపులపై దృష్టి సారినడం లేదని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి కాకుండాబయట ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయించరాదని ఆదేశాలున్నాయి. అయినా ఆ నిబంధనలు నిర్వాహకులు పాటించడంలేదని. దీంతో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని ప్రజలుఆరోపిస్తున్నారు.గ్రామాల్లో బెల్ట్ షాపులు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలి డబ్బులుతో మద్యం తాగుతూ సంసారాలను పాడు చేసుకుంటున్నారు. ప్రాణాలను సైతం వదులు కుంటున్నారని కుంటున్నారని. పొద్దంతా సంపాదించిన సంపాదన మద్యానికి ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు పస్తులు0 డాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మద్యానికి బానిసలైన కొందరు ఏ పని చేయకుండా ఉదయాన్నే బిల్డ్ షాప్ లకు చేరుకొని ఉద్దెర పెట్టి అప్పుల పాలవుతున్నారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్న బెల్ట్ షాపులు

- Advertisement -

మద్యం ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి. దీంతో ప్రజా ఆరోగ్యానికి చిల్లు పడుతుంది. బెల్టు షాపుల్లో ప్రతి క్వార్టర్ కు రూ.20 నుంచి రూ.40 వరకు. ఒక్క బీరు సీసా మీద రూ 30 నుంచి 50 అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు బాగా పెరిగాయి. వాటిలో కూడా కల్తీ మద్యం కలుపుతూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారని. అయినా తాగడం తప్పడం లేదని మద్యం ప్రియులు అంటున్నారు.
పేరుకే కిరాణ దుకాణం లోన చూడండి అది బెల్ట్ షాపే

అనేక మంది పేరుకు కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్నా లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బహిరంగం గానే బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. రాత్రి అయితే అక్కడ పండుగ వాతావరణంలా కనబడుతూ చుట్టు పక్కల ఉన్న ఇండ్లు వాసులకు కూడ ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామం లోపలికి వెళ్తే కిరాణా దుకాణాల్లో సొంత ఇళ్లలో పెద్ద పెద్ద ఫ్రిజ్జులు పెట్టుకొని మరి విక్రయిస్తుండడం చాలా ఉన్నాయి. మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణా దుకాణాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో కల్తీ మద్యం తెప్పించి అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంచుమించు ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు వెలిసి. ఊరంతా ఏరులై పాడుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. బెల్టు షాపులను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. గ్రామాల్లో కొన్ని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు! అనే పూర్తి సమాచారం ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్న! ఇప్పటి వరకు ఏ బెల్ట్ షాపులపై దాడులు చేసిన దాఖలాలు లేవని గుడుంబా స్థావరాలపై దాడులు మాత్రం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News