వియత్నాంలో పర్యటిస్తున్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. వియత్నాం ప్రభుత్వ ప్రణాళిక, పరిశ్రమల డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశం. వొకేషనల్ ట్రైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన తోడ్పాటుపై ప్రధానంగా చర్చ, వియత్నాం నుంచి మరింత సహకారం దిశగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకారం.
వియత్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ట్రాన్ కోక్ ఫుంగ్ ను కలిసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. హనోయిలోని ఇండియా హౌస్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి పలికిన ఆర్థిక మంత్రి బుగ్గన వియత్నాంలోని అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ ‘గార్కో 10’ను సందర్శించిన మంత్రి బుగ్గన. టెక్స్ టైల్ కంపెనీ ఏర్పాటుకు గల అవకాశాలపై ప్రధానంగా చర్చ.
‘గార్కో 10’ సహకారంతో వృత్తివిద్య కళాశాలల ఏర్పాటు, పెట్టుబడుల అవకాశాలపైనా చర్చ. హానోయ్ టెక్స్ టైల్ అండ్ గార్మెంట్స్ యూనివర్శిటీని సందర్శించారు మంత్రి.
టెక్స్ టైల్ రంగంలోని సాంకేతికత, ఫ్యాషన్ శిక్షణలో సహకారానికి గల అవకాశాలపై అధ్యయనం. వియత్నాంలోని హనోయ్ లో భారత రాయబారి సందీప్ ఆర్యాను కలిసిన ఆర్థిక మంత్రి.
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.