Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Govt: జగన్ విశాఖ పోతుంటే అక్కడ ఉన్నవాళ్లు పారిపోతున్నారా?

AP Govt: జగన్ విశాఖ పోతుంటే అక్కడ ఉన్నవాళ్లు పారిపోతున్నారా?

AP Govt: ఎవరు ఎన్ని చెప్పినా.. ఏం జరిగినా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విశాఖ నుండే జరగాలని మొండిగా ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టులో కేసు ఎలాగూ వ్యతిరేకంగా వస్తుందన్న ఆలోచనతోనే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. మళ్ళీ పగడ్బంధీగా ఈ బిల్లును తీసుకురావాలని చూస్తుంది. దానికి సరైన సమయం కోసం జగన్ సర్కార్ వేచివుంది. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని ఇప్పటికీ వైసీపీ నేతలు చెప్తూనే ఉన్నారు. సుందరనగరమైన విశాఖలో దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. దానికి కొద్దిపాటి మొత్తం కేటాయిస్తే రాజధాని సిద్ధమవుతుందని సాక్షాత్తు సీఎం జగన్ పలుమార్లు చెప్పారు. విశాఖలో వసతులు, కార్యాలయాల కోసం.. ముఖ్యంగా సీఎం క్యాంప్ ఆఫీసు కోసం కూడా ఇప్పటికే స్థల నిర్ధారణ జరిగిపోయిందన్నది వైసీపీ నేతల నుండి చెప్పేమాట. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అయినా జగన్ రాజధానిని విశాఖకి తరలించడం ఖాయంగా వినిపిస్తుంది.

- Advertisement -

అయితే, జగన్ విశాఖకు రాజధాని తీసుకెళ్తామని అంటుంటే.. అక్కడ ఉన్న కెంపెనీలు మేము ఉండమని తరలిపోతున్నాయి. ఆ మాటకొస్తే ఒక్క విశాఖ నుండే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కంపెనీలు ఇప్పటికే తరలిపోగా.. మరికొన్ని రావాల్సిన కంపెనీలకు సంబంధించి ఒప్పందాలను ఈ ప్రభుత్వం రద్దు చేసుకుంది. కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ వెళ్లిపోగా.. అదానీ డేటా సెంటర్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ వంటి సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేశారు. అంతేకాదు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ఏషియన్ పల్ప్ పేపర్ పరిశ్రమ పెట్టుబడులు ఉపసంహరించుకోగా.. బీఆర్ షెట్టి సంస్థలు, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టులు, రేణిగుంటలో రిలయన్స్ పెట్టుబడులు, ఒంగోలు నుంచి ఏపీపీ పేపర్ కంపెనీ, విశాఖ రుషికొండ ఐటి సెజ్ నుండి కంపెనీలు తరలిపోయాయి. చిత్తూరు జిల్లాకు తలమానికమైన అమర్ రాజా బ్యాటరీస్ కూడా చెన్నై లేదా హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటి వరకు వెళ్లిన వాటిలో ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వ ఒప్పంద సంస్థలే కాగా.. ఇప్పుడు ఏకంగా కేంద్ర సంస్థ కూడా విశాఖ నుండి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని వినిపిస్తుంది. పెట్రోలియం యూనివర్సిటీ ఏపీ నుండి తరలిపొంతుందన్న వార్త ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేయడం ఖాయంగా కనిపిస్తుంది. విభజన హామీల్లో భాగంగా ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్టీ సంస్థను స్థాపించారు. ఈ విద్యా సంస్థ దేశంలో రెండే చోట్ల ఉంది. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉండగా.. రెండోదాన్ని విశాఖపట్నానికి కేటాయించారు.

ఈ సంస్థ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వంగలి గ్రామంలో సుమారు 201.8 ఎకరాల సేకరణకు సిద్ధమై కొంత భూమిని సేకరించి 2016లోనే భూమి పూజ కూడా చేశారు. శాశ్వత క్యాంపస్‌ అందుబాటులోకి వచ్చే వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 60, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 సీట్లు ఉండగా.. ఇప్పటికే రెండు బ్యాచ్ లు కూడా బయటకు వెళ్లిపోయాయి. మొత్తం రూ.655 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం కోసం మొదటి దశగా రూ.150 కోట్లు విడుదల చేశారు. ముందుగా సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణ బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించగా ఇప్పటి వరకు ఈ ప్రహరీ నిర్మాణం సగమే పూర్తయింది. కారణం భూసమస్య. పట్టాదారులతో సమానంగా తమకూ నష్టపరిహారం చెల్లించాలని పట్టాలేని రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. విచారించిన ధర్మాసనం సాగులో ఉన్నారు కనుక పట్టాదారులకు ఇచ్చినట్టుగానే పట్టాలేని రైతులకూ ఇవ్వాలని ఆదేశించింది.

కానీ, పట్టాలేని రైతులకు ఇక్కడ అంత మొత్తంలో చెల్లిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే చెల్లించాల్సి వస్తుందని, ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కేసు పెండింగ్‌లో ఉండడంతో ఇది ఇప్పట్లో తేలే అంశం కాదని కేంద్రం ఈ విద్యాసంస్థను తరలించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖ యూనివర్సిటీని కూడా యూపీ యూనివర్సిటీలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే జగన్ సర్కార్ పరువు పోవడం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News