Saturday, November 23, 2024
Homeహెల్త్Rosy Cheeks: సిగ్గులొలికే ఎర్రని బుగ్గల కోసం..

Rosy Cheeks: సిగ్గులొలికే ఎర్రని బుగ్గల కోసం..

నిర్మలమైన మనస్సు, మంచి ఆహారం తీసుకుంటే మీ బుగ్గలు మెరిసిపోవటం ఖాయం

గులాబీ రంగు బుగ్గల కోసం ఇలా చేద్దాం..

- Advertisement -

గులాబీ బుగ్గలు ముఖానికి ఇచ్చే అందం ఎంతో. అలాంటి రోజీ చీక్స్ కావాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి? బుగ్గలు గులాబీ రంగులో మెరుస్తుంటే ముఖం ఎంతో తాజాగా, మరెంతో అందంగా కనపడుతుంది. అలాంటి రోజీ చీక్స్ కోసం కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మీ బుగ్గలు కూడా గులాబీ రంగు మెరుపులు చిందిస్తాయి. బుగ్గలకు ఆవిరి పట్టుకుంటే మెరుస్తాయి.

ఆవిరి చర్మంపై ఉండే రంధ్రాలను తెరిచేలా చేయడం వల్ల రక్త ప్రసరణ బుగ్గలకు బాగా జరుగుతుంది. నేచురల్ ఫేషియల్ మాస్కులైన తేనె, రోజ్ వాటర్, పెరుగు వంటివి కూడా చర్మాన్ని మ్రదువుగా చేయడంతో పాటు ఎంతో కాంతివంతం చేస్తాయి. ముఖానికి ఆవిరి పట్టుకోవడం వల్ల అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే హాని నుంచి చర్మం రక్షించబడుతుంది. అందుకే నిత్యం బయటకు వెళ్లే ముందర తప్పనిసరిగా ముఖానికి సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఇది కూడా బుగ్గలను సున్నితంగా తయారుచేస్తాయి. అలొవిరా, తేనె రెండూ కలిపి ఆవిరిని పదిహేను ఇరవై నిమిషాలు పెట్టుకుంటే చర్మం ఆరోగ్యవంతమైన మెరుపును పొందుతుంది. బుగ్గలను గులాబీ రంగులోకి తేవడంలో గులాబీ రెక్కలు ఎంతో బాగా పనిచేస్తాయి. క్రీమ్ రూపంలో ఉండే ఉత్పత్తులను బుగ్గల మీద రాసుకుంటే కూడా సహజసిద్ధమైన గులాబీ రంగును మీ బుగ్గలు సంతరించుకుంటాయి. నిత్యం గులాబీ రెక్కలను మెత్తగా చేసి ఆ పేస్టును బుగ్గలకు అప్లై చేసుకుంటే బుగ్గలు సహజసిద్ధమైన గులాబీ వర్ణంతో మెరుస్తాయి. అంతేకాదు నలుగురిలో మిమ్మల్ని ఆకర్షణీయంగా చేస్తాయి.

బుగ్గలు మెరవాలంటే సరైన డైట్ కూడా తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం వల్ల బుగ్గలు తళతళలాడతాయి. అందుకే డైట్ లో ఉన్నవాళ్లు కూడా భోజనం ఒక్క పూట కూడా మానకూడదు. అలాగే క్రాష్ డైటింగ్ చాలామంది చేస్తుంటారు.  ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. రోజులో కనీసం నాలుగు పర్యాయాలు చిన్న చిన్న మొత్తాలలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, టీ , డిన్నర్ తప్పనిసరిగా ఫాలో అవాలి. భోజనానికి మధ్యలో ఆకలి అనిపిస్తే తేలికపాటి ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే తినాలి. మీరు తినే ఫుడ్ మీ చర్మానికి సహజసిద్ధమైన మెరుపును ఇస్తుందని మరవొద్దు. ఫిష్, చికెన్ ప్రొటీన్లు తీసుకోవాలి. మటన్ లాంటివి తినకూడదు. మొలకలు తినడం ఎంతో మంచిది. వీటిల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

తక్కువ కొవ్వు ఉన్న పాలను, తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, మీగడ తీసిన పాలను వాడాలి. మాంసక్రుతుల నిధి అయిన గింజలను మీ భోజనంలో తప్పనిసరిగా చేర్చాలి. ఇవి శరీరానికి తగినన్ని పోషకాలను నిత్యం అందిస్తాయి. అలాగే రోజూ వ్యాయామాలు చేయడం వల్ల కూడా చర్మం మెరుపును సంతరించుకుంటుంది. చర్మం తగినంత మాయిశ్చరైజర్ ని సైతం పొందుతుంది. అలాగే నిత్యం వ్యాయామాలు చేయడం ద్వారా  కాంతివంతమైన,అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. వ్యాయామాలు చేసిన తర్వాత చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాలన్న విషయం మరవొద్దు. చర్మాన్ని నిత్యం ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవడానికి మైల్డ్ గా ఉండే స్ర్కబ్ వాడడం ఉత్తమం.అలాగే నిత్యం చర్మాన్ని మొరటుగా స్ర్కబ్బింగ్ చేయకూడదు కూడా. అలా చేస్తే చర్మం టెక్స్చెర్ దెబ్బతింటుంది.  అందుకే వారానికి ఒకసారి చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసుకుంటే సరిపోతుంది. మీ బుగ్గలు నవ నవలాడుతూ కనిపిస్తాయి. అలాగే మైల్డ్ బ్లీచింగ్ కూడా మీ బుగ్గలను గులాబీ రంగులో మెరిసేలా చేస్తాయి.

ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ లో మూడు టేబుల్ స్పూన్ల నీరు కలిపి ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి దాన్ని బుగ్గల మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మీ బుగ్గలకు ఎక్కడలేని అందం వస్తుంది. ఇది ఒకవేళ మీ చర్మానికి పడకపోతే  మానేయాలి. చర్మం మెరిసేలా ఉండాలంటే ముఖ్యంగా రెండు రకాల విటమిన్లు చాలా ముఖ్యం. అవే విటమిన్ ఇ, విటమిన్ సిలు. మీ పెదాలు పగిలినా, మీ ఫేషియల్ స్కిన్ పొడిబారినా అందుకు కారణం మీలో విటమిన్ ఇ, విటమిన్ సి లోపించడమే. బుగ్గలు మెరవపోవడానికి ఇది కూడా ఒక కారణం. అందుకే ఇలాంటి వాళ్లు వైద్యులను సంప్రదించి ఈ రెండు రకాల విటమిన్ సప్లిమెంట్లు వాడితే మంచిది. అంతేకాదు కమలాపండు తొక్కల పేస్టును చర్మంపై అప్లై చేసినా కూడా ఎంతో మంచిది. ఈ తొక్కల పేస్టును మీగడపాలు, విటమిన్ ఇ కాప్సూల్ మిశ్రమంతో కలిపి ఆ గుజ్జును చర్మంపై, మరీ ముఖ్యంగా బుగ్గలపై రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. విటమిన్ సి లోపం ఉంటే చర్మం ఎంతో కాంతివిహీనంగా కనిపిస్తుంది. నేడు విటమిన్ సి లోటు చాలామందిలో బాగా కనిపిస్తోంది. చర్మం, బుగ్గలు డల్ గా కనిపించడానికి ఒత్తిడి, కోపం కూడా ప్రధానకారణాలే. వీటిని అధిగమించేందుకు యోగా లేదా మెడిటేషన్ చేయడం ఎంతో మంచిది.

నిద్ర బాగా పోవాలి.  నిద్ర మీకు సరిగా పట్టడం లేదంటే మీలో ఒత్తిడి ఇంకా నియంత్రణలోకి రాలేదని అర్థం. అందుకే నిద్ర బాగా పోవాలి.  దాంతో ముఖం తాజాగా తయారవుతుంది. సరిపడినంత నిద్ర ఉండడం వల్ల చర్మం కూడా సహజసిద్ధమైన కాంతితో మెరుస్తుంది. బాగా నిద్రపోతే రోజంతా తాజాగా, ఉల్లాసంగా ఉంటారు. చర్మం కింది భాగంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంటే కూడా చర్మం మంచి మెరుపును సంతరించుకుంటుంది. క్లాక్ వైజ్, యాంటి క్లాక్ వైజ్ లో మసాజ్ చేస్తే చర్మం మ్రుదువుగా, బుగ్గలు రోజీగా మారతాయి. ఇలా కొన్ని రోజులపాటు నిత్యం చేస్తే మీరు మంచి ఫలితాలు చూస్తారు.  అలాగే ఫేషియల్ మసాజ్ చేయడం వల్ల కూడా చర్మం కాంతివంతమవుతుంది. ఫేస్ యోగాలోని కొన్ని భంగిమలతో కూడా మీ బుగ్గలు అందంగా తయారవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News