హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (ఎచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి) లో పనిచేస్తున్న కాంట్రాక్ట్-ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది.
- Advertisement -
ఈ సందర్భంగా.. తమ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు మెట్రో వాటర్ వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, యూనియన్ నేతలు సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.