IND vs BAN Test Match: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో గురువారం రెండో రోజు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 404 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 133 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. సిరాజుద్దీన్, కుల్దీప్ యాదవ్‌ల బౌలింగ్ దాటికి బంగ్లా బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. సిరాజుద్దీన్ అద్భత బౌలింగ్ తో మూడు వికెట్లు తీయగీ, కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
భారత జట్టు ఆరు వికెట్లకు 278 పరుగులతో రెండోరోజు ఆట ప్రారంభించింది. తొలిరోజు ఆట బౌంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్ రెండో రోజు ఆరంభంలోనే వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత ఆర్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్ మధ్య మంచి భాగస్వామ్యం కుదిరింది. ఈ క్రమంలో భారత జట్టు ఖాతాలో పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు వచ్చిచేరాయి. బ్యాటింగ్ చేస్తున్న అశ్విన్ బంగ్లా బౌలర్ తైజుల్ వేసిన బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతని బ్యాట్ వెలుపలి అంచుని తీసుకొని థర్డ్ మ్యాన్ దిశలో వెళ్లింది. బాల్ దూరంగా వెళ్తున్న అశ్విన్, కుల్‌దీప్ పరుగులు చేసి సింగిల్స్ తీశారు. ఫీల్డర్ కీపర్ వైపు త్రో విసిరాడు. బంతి నేరుగా వెళ్లి నేలపై ఉంచిన హెల్మెట్‌ను తాకింది. ఈ హెల్మెట్ వికెట్ కీపర్ వెనుక ఉంచబడింది. బంతి హెల్మెట్‌కు తగలగానే అంపైర్ ఐదు పరుగుల పెనాల్టీని సూచించాడు. భారత ఇన్నింగ్స్ 112వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.
నియమం ప్రకారం.. నేలపై ఉంచిన హెల్మెట్‌పై బంతి వికెట్ కీపర్ లేదా ఫీల్డింగ్ జట్టులోని ఏదైనా ఆటగాడికి తగిలితే, ఆ బంతిపై బ్యాటింగ్ చేసిన జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా ఇవ్వబడతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇదిలాఉంటే భారత జట్టు మంచి స్కోరు సాధించడంలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కీలక పాత్ర పోషించారు. ఇందులో అశ్విన్ 58 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇది 13వ అర్ధ సెంచరీ. అదే సమయంలో అశ్విన్‌తో కలిసి క్రీజులో ఉన్న కుల్దీప్ యాదవ్ జట్టుకు అవసరమైన 40 పరుగులు చేశాడు.