Friday, September 20, 2024
HomeతెలంగాణJammikunta: ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Jammikunta: ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

కేటీఆర్ సేవలను గుర్తుచేసుకున్న తక్కల్లపల్లి రాజేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్ హాజరయ్యారు. కేటీఆర్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. విద్యార్థినీ విద్యార్థులు మానవహారంగా ఏర్పడి కేటీఆర్ ఆకారం లో నిలబడి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఉద్యమ దశ నుండి తనదైన శైలిలో అనేక పోరాటాలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినా క్షణం నుండి ప్రతినిత్యం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేశారన్నారు.

- Advertisement -

, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఐ టి, ఐ ఆర్ కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి.తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఐటి, హబ్ లు నెలకొల్పి యువతకు ఉపాధి కోసం కృషి చేశారని, మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సేవలు మరువలేని వన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపే విధంగా కృషి చేస్తున్నారని ఇంత గొప్ప నాయకుడు మన రాష్ట్రానికి మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ జిల్లా వైస్ చైర్మన్ పింగళి రమేష్ జమ్మికుంట బ్యాంక్ చైర్మన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు పాతకాల రమేష్, దిడ్డిరాము దేశిని సదానందం ,బొంగోని వీరన్న, పొనగంటి సారంగం శ్రీపతి నరేష్, పొనగంటి రామ్మూర్తి, బొద్దుల అరుణ రవీందర్ జుగురు సదానందం, దయ్యాల శ్రీనివాస్, రావి కంటి రాజు దిలీప్ తో పాటు పార్టీ నాయకులు మనోహర్ రావు వార్డు అధ్యక్షులు మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, మహిళ లు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల తో పాటు జమ్మికుంట పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News