Viral Video : సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా సరే క్షణాల్లో తెలిసిపోతుంది. కొన్ని వీడియోలు ఆనందాన్ని పంచితే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. వివాహవేదిక పై కొత్త జంట కొట్టుకున్న వీడియోను ఘర్కేకలేష్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఏం ఉందంటే.. పెళ్లి తంతులో భాగంగా వరుడు వధువుకు మిఠాయి తినిపించాలని ప్రయత్నిస్తాడు. అయితే వధువు ఆ స్వీట్‌ను తినేందుకు నిరాకరిస్తుంది. అయినప్పటికి వరుడు బలవంతంగా ఆమెకు తినిపించబోయాడు. అంతే ఉగ్రరూపం దాల్చిన వధువు.. వరుడి చెంప పగలకొట్టింది. అందరి ముందు వధువు కొట్టడడంతో అతడు కోపంతో ఆమెను కొట్టాడు. ఇలా ఒకరిని మరొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న బంధువులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకోవాలని ప్రయత్నించినా వారు ఆగలేదు. అప్పటి వరకు ఎంతో సందడిగా ఉన్న వాతావరణం కాస్త ఈ ఘనటతో గంభీరంగా మారింది.
ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో WWE సౌండ్‌లతో ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరు కాపురం చేసినట్లే అని ఓ యూజర్ కామెంట్ చేయగా మీకు అప్పుడే విడాకులు కావాలా అంటూ మరొకరు అన్నారు.