Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభDhamaka : ర‌వితేజ 'ధ‌మాకా' ట్రైల‌ర్‌.. అదిరిపోయిందిగా

Dhamaka : ర‌వితేజ ‘ధ‌మాకా’ ట్రైల‌ర్‌.. అదిరిపోయిందిగా

Dhamaka : మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం ‘ధ‌మాకా’. త్రినాథ రావు ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల క‌థానాయిక‌. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

- Advertisement -

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్లు, పాట‌లు చిత్రం పై అంచ‌నాల‌ను పెంచ‌గా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ మంచి విజువ‌ల్స్, ర‌వితేజ మార్క్ డైలాగ్స్‌ల‌తో నిండి ఉంది. ‘అమ్మ పళ్లు తీసుకురమ్మంది’, ‘నేను వెనుక ఉన్న వాళ్ళని చూసుకుని పైకి వచ్చిన వాడిని కాదు’ వంటి డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

ఇదిలా ఉంటే… ఈ చిత్ర‌ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 30 కోట్ల వరకు జ‌రిగింది. ఈ చిత్ర‌ హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లుకు పలికాయట. మరోవైపు శాటిలైట్, డిజిటల్ హక్కులు రూ. 20 కోట్లు పలికినట్లు తెలుస్తోంది.

‘క్రాక్’ చిత్రంతో భారీ విజ‌యాన్ని అందుకున్న ర‌వితేజ‌కు ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు నిరాశ మిగిల్చాయి. దీంతో ‘ధ‌మాకా’ చిత్రంపై ర‌వితేజ భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News