Sunday, October 6, 2024
HomeతెలంగాణVemula: వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు వెంటనే రిపేర్ చేయాలి

Vemula: వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు వెంటనే రిపేర్ చేయాలి

రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదంటూ మంత్రి ఆదేశాలు

అధిక వర్షాలు,వరదల వల్ల పాడైన ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని రోడ్లు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు…డా. బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లోనీ మంత్రి ఛాంబర్ లో ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదని మంత్రి ఈ సందర్బంగా అధికారులకు స్పష్టం చేశారు.

- Advertisement -

క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారికి సైతం పరిపాలన అనుమతుల అధికారం కల్పిస్తూ సీఎం కేసిఆర్ ఆర్ అండ్ బి శాఖ పునర్వ్యస్థీకరణ లో విప్లాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా డి.ఈ నుంచి ఆ పై స్థాయి అధికారి వరకు ప్రత్యేకంగా నిధులు అందుబాటులో ఉంచారని అన్నారు. డి.ఈ స్థాయి అధికారి కూడా స్థానిక పరిస్థితులకు అనగుణంగా తక్షణం రోడ్డు మరమ్మత్తు కోసం నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారన్నారు. డి.ఈ 2లక్షలు,ఈ.ఈ 25 లక్షలు, ఎస్.ఈ 50 లక్షలు,సి.ఈ 1కోటి,ఈఎన్సి 20 కోట్ల వరకు రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం వినియోగించేలా చర్యలు చేపట్టారని అన్నారు. దాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులు సద్వినియోగం చేసుకొని ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు.

యుద్ధ ప్రాతిపదికన అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి సెక్రెటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సి రవీందర్ రావు,సి.ఈ లు సతీష్,మోహన్ నాయక్, ఎస్.ఈలు మోహన్,శ్రీనివాస రావు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News