బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ సమక్షంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సర్వమత ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి, కార్యకర్తలకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా 200 ఎలక్ట్రానిక్ స్కూటీలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినం యువతకు ఒక పండుగ లాంటిదని, వారి స్పూర్తితో ఈ రోజు 200 మంది బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలక్ట్రానిక్ స్కూటీలను బహుమతి ఇచ్చామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు రాజకుమార్ పటేల్, సిఎన్.రెడ్డి,దేదీప్య రావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ,వేణుగోపాల్ యాదవ్,ప్రదీప్,అప్పు ఖాన్,సంతోష్, కృష్ణమోహన్, నాయకులు విజయకుమార్,తన్ను ఖాన్,విజయసింహ, సిరాజ్,షరీఫ్, సుబ్బరాజు,నజీర్, బషీర్,అరుణ్, నాగరాజు,శ్యామరావు, నర్సింగ్ దాస్,షకీల్ అహ్మద్,సజ్జాద్ పాల్గొన్నారు.