సమస్యల పరిష్కారమే గడప గడపకు మనప్రభుత్వం అని, రైతు సంక్షేమ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉపాధి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. మండలంలోని జిల్లేడు బుడకల, మాదాపురం, ఓబులాపురం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాం ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు పడకుండా ఉండడానికి సచివాలయంలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటుచేసి రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. రైతు సంక్షేమానికి ప్రతి ఏటా పంటల బీమా, రైతు భరోసా కింద పరిహారం అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. జిల్లేడు బుడకల గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను మార్చాలని, సిసి రోడ్డు, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని అదేవిధంగా మాదాపురం గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చాలని ఆయా గ్రామస్తులు మంత్రికి విన్నవించుకున్నారు. అందుకు స్పందించిన మంత్రి గడపగడప కార్యక్రమంలో సచివాలయానికి మంజూరయ్యే నిధులతో వాటిని పూర్తి చేయిస్తామన్నారు.సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించారు.
పత్తికొండ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై భూపాలుడు బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గుమ్మనూరు సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామి, మండల జడ్పిటిసి కిట్టు, ఎంపీపీ లక్ష్మీదేవి భర్త లుముంబా, వైసిపి మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున,ఎంపీడీఓ గౌరీదేవి,ఏవో సురేష్ బాబు,ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ మురళీమోహన్, ఏ.పి.ఎం రమేష్ బాబు,ఎంఇఓ తిమ్మారెడ్డి, వైసిపి మండల నాయకులు మోహన్ రెడ్డి, ప్రేమ్ నాథ్ రెడ్డి, నారాయణరెడ్డి, దివాకర్ నాయుడు, ఎల్ కే.శీను రామచంద్ర, కొత్తపేట బాబు, దస్తగిరి, కౌలుట్ల పాల్గొన్నారు.